Ind vs Aus 1st T20: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా (Australia vs India, 1st T20I) మధ్య ఇవాల్టి నుంచి టీ 20 సిరీస్ ప్రారంభం కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ పూర్తయింది. ఇవాళ్టి నుంచి టి20 సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ సిరీస్ లో భాగంగా ఇవాళ కాన్ బెర్రా వేదికగా ( Manuka Oval, Canberra ) మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో కాసేపటికి క్రితమే టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది.
Also Read: Indian Team: ఎముకలు కొరికే చలిలో టీమిండియా ప్రాక్టీస్.. చేతులు పగిలిపోతున్నాయి.. వీడియో వైరల్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న t20 సిరీస్ నేపథ్యంలో టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ రెండు జట్ల మధ్య జరగనున్న మూడు టి20 లకు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి దూరం కాబోతున్నాడు. ఈ మేరకు టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అధికారిక ప్రకటన చేశాడు. దీంతో టీమిండియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సమయంలో గాయపడిన హార్దిక్ పాండ్యా… లాంటి డేంజర్ ఆల్ రౌండర్ జట్టుకు దూరం కాగా, ఇప్పుడు మరో ఆల్ రౌండర్ తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా దూరమయ్యాడు.
అయితే నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో శివం దుబే బరిలోకి దిగుతున్నాడు. ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టి20 రికార్డులు పరిశీలిస్తే, మనోళ్లు బాగానే రాణించారని చెప్పవచ్చు. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 32 మ్యాచులు జరిగాయి. ఇందులో టీమిండి అనే 20 t20 లలో విజయం సాధించింది. ఆస్ట్రేలియా ( AUs) కేవలం 12మ్యాచ్ లలో విజయం సాధించడం విశేషం. అంటే టి20 లో మనోళ్లు సత్తా చాటారని రికార్డులు చెబుతున్నాయి.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్
భారతదేశం (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు సామ్సన్ (వికెట్ కీపర్), శివం దుబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా
Here are the playing XIs for Australia and India for the T20I series opener in Canberra! 🇦🇺🇮🇳🔥#AUSvIND #T20Is #Canberra #Sportskeeda pic.twitter.com/iDnjD6HwUy
— Sportskeeda (@Sportskeeda) October 29, 2025