BigTV English
Advertisement

Donlee: స్పిరిట్ లో డాన్ లీ.. కన్ఫర్మ్ చేసిన కొరియన్ మీడియా

Donlee: స్పిరిట్ లో డాన్ లీ.. కన్ఫర్మ్ చేసిన కొరియన్ మీడియా

Donlee: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.  ఏ ముహూర్తంలో ప్రభాస్ అభిమానులకు మాటిచ్చాడు తెలియదు కానీ, అప్పటినుంచి డార్లింగ్ ఆ మాటకు కట్టుబడే ఉంటున్నాడు. ఎప్పుడు రెండేళ్లకు ఒకసారి ఒక సినిమా కాకుండా కనీసం ఏడాదికి ఒక సినిమా అయినా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తానని డార్లింగ్ మాట ఇచ్చాడు. ఆ మాటకు తగ్గట్టే వరుస సినిమాలను లైన్లో పెట్టి ప్రతి ఏడాదికి ఒక్కో సినిమాను రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.


తాజాగా ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు కంటే ఎక్కువే ఉన్నాయని తెలుస్తుంది. అందులో  ది రాజాసాబ్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. ఫౌజీ సెట్స్  మీద ఉంది.  ఇక ఇవి కాకుండా ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం స్పిరిట్. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ తలరాతను మార్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో అనిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా  నటిస్తుండగా ప్రకాష్ రాజ్, కాంచన వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఆడియో గ్లింప్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై మరిన్ని అంచనాలను రేకెత్తించేలా చేసింది.  ఇక ఎప్పటినుంచో స్పిరిట్ లో కొరియన్ హీరో డాన్ లీ  విలన్ గా నటిస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎవరు అధికారికంగా ప్రకటించలేదు. ఈమధ్య వచ్చిన ఆడియో గ్లింప్స్ లో  కూడా డాన్ లీ  పేరు వంగా  ప్రకటించలేదు.  దీంతో డాన్ లీ స్పిరిట్ లో నటించడంలేదని అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.


అయితే తాజాగా కొరియన్ మీడియా స్పిరిట్ లో  డాన్ లీ నటిస్తున్నాడనే వార్తను అధికారికంగా ప్రకటించడం సెన్సేషనల్ గా మారింది. “స్పిరిట్ అనే చిత్రంలో డాన్ లీ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. బాహుబలి సినిమాతో ఫేమస్ అయిన ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో డాన్ లీ నెగిటివ్ పాత్రలో కనిపిస్తున్నాడని వినికిడి” అంటూ రాసుకొచ్చారు. దీంతో డాన్ లీ స్పిరిట్ లో నటించడం కన్ఫర్మ్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి త్వరలోనే వంగా కూడా అధికారికంగా ప్రకటిస్తాడేమో చూడాలి.

Related News

Malavika Mohanan: చిరంజీవి సినిమాలో నటించాలని ఉంది కానీ.. క్లారిటీ ఇచ్చిన మాళవిక!

Arundathi Remake: రీమేక్ కు సిద్ధమైన అరుంధతి.. జేజమ్మ పాత్రలో నటించేది ఈ హీరోయినే ?

Chiranjeevi: మళ్లీ పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి.. సామాన్యుల పరిస్థితేంటో ?

The Great Pre Wedding Show Trailer: పెళ్లి ఫోటో గ్రాఫర్ గా హీరో.. నవ్విస్తున్న ‘ది గ్రేట్ ఫ్రీవెడ్డింగ్ షో‘ ట్రైలర్..

HBD Nagababu: ఆరోజు తమ్ముడి నిర్ణయం.. నేడు నిలదొక్కుకోవడానికి కారణం అయిందా?

Pawan Kalyan Next Movie : స్టార్ నిర్మాత నుంచి పవన్ కళ్యాణ్‌కు 20 కోట్ల అడ్వాన్స్?

Kantara 1 OTT: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి కాంతార 1.. కారణం చెప్పిన నిర్మాత

Big Stories

×