Rajendra Prasad :నట కిరీట రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) తాజాగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. మాస్ మహారాజా రవితేజ(Raviteja ) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోకి తాత పాత్రలో రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు. ఇకపోతే నవంబర్ 1వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. అందులో భాగంగానే ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
అసలు విషయంలోకి వెళ్తే.. మాస్ జాతర అక్టోబర్ 31వ తేదీన పెయిడ్ ప్రీమియర్లతో రిలీజ్ కాబోతోంది. ప్రముఖ రచయిత భాను భోగవరపు (Bhanu Bhogavarapu) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీలా (Sreeleela) హీరోయిన్గా నటిస్తోంది. ముఖ్యంగా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాదులో నిన్న రాత్రి గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. మాస్ జాతర ప్రేక్షకులను షాక్ కు గురి చేయకపోతే నేను పరిశ్రమను వదిలేస్తాను “అంటూ ఆయన నమ్మకంగా ప్రకటించారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..” ఈ మధ్యకాలంలో అన్ని మాస్ మసాలాలు కలబోసిన సినిమా ఒక్కటి కూడా రాలేదు. మాస్ జాతర సినిమాను థియేటర్లలో చూసి ప్రేక్షకులు కచ్చితంగా షాక్ అవుతారు. అలా అవ్వకపోతే నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను” అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.. ముఖ్యంగా తాను ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేస్తే బ్లాక్ బాస్టర్ వచ్చాయని.. కానీ రవితేజతో అలాంటి ఒక బ్లాక్ బాస్టర్ సినిమా తనకు లేకపోవడం బాధ కలిగించిందని, రవితేజ ప్రస్తుత సినిమాలు చూసిన తర్వాత మాస్ జాతరతో బిగ్గెస్ట్ హిట్ పడుతుందని నమ్ముతున్నాను అంటూ ఆయన స్పష్టం చేశారు.
అలాగే ఈ సినిమా గురించి మాట్లాడుతూ..” రవితేజ ఇందులో కొన్ని సన్నివేశాలను కావాలని అడిగి మరీ పెట్టించుకున్నాడు. స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది” అంటూ రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే సినిమాపై అంచనాలు పెంచేశారు. మరి ఈ సినిమా అసలు ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
ALSO READ:Bigg Boss 9 Promo: రీఎంట్రీ ఫైర్.. చిరాకు దొబ్బుతున్నారు భయ్యా!
రాజేంద్రప్రసాద్ కెరియర్.. సినిమా నటుడిగా, నిర్మాత, సంగీత దర్శకుడిగా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు రాజేంద్రప్రసాద్. ఈయన నటించిన సినిమాలలో ఆహనా పెళ్ళంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ ఒకటి విడుదల, మాయలోడు వంటి చిత్రాలు ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఒకప్పుడు తన సినిమాలతో కామెడీ పండించి ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచుకున్న రాజేంద్రప్రసాద్.. ఇప్పుడు ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తండ్రి, మామ లాంటి పాత్రలే కాకుండా ఇప్పుడు ఏకంగా తాత పాత్రలు కూడా పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చేసే కామెంట్లతో కూడా వార్తల్లో నిలుస్తున్నారని చెప్పవచ్చు.