OnePlus Turbo: వన్‌ప్లస్ కంపెనీ నుంచి రాబోతున్న కొత్త స్మార్ట్‌ఫోన్ “వన్‌ప్లస్ టర్బో” ప్రస్తుతం టెక్ ప్రపంచంలో చర్చకు కేంద్రంగా మారింది. ఈ ఫోన్ పూర్తిగా గేమింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్లాగ్‌షిప్ మోడల్ అని సమాచారం. ఇప్పటికే లీక్‌లు, రూమర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. వన్‌ప్లస్ ఈసారి పవర్‌ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో గేమర్లను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది.
టర్బో అంటే అర్థం
“టర్బో” అనే పేరు నుంచే అర్థమవుతుంది వేగం, శక్తి, పనితీరు అన్నీ ఈ ఫోన్‌లో కొత్త స్థాయిలో ఉంటాయని కంపెనీ సంకేతాలు ఇస్తోంది. వన్‌ప్లస్ Ace సిరీస్ తర్వాత ఇప్పుడు “టర్బో” అనే కొత్త లైన్ అప్ ద్వారా బ్రాండ్ మరో మైలురాయిని చేరేలా కనిపిస్తోంది.
స్లిమ్ బాడీ- డిజైన్
డిజైన్ విషయానికి వస్తే, వన్‌ప్లస్ టర్బో ఫోన్ మోస్తరు మెటల్ ఫ్రేమ్‌తో, స్లిమ్ బాడీతో రావొచ్చు. గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ప్రత్యేక కూలింగ్ సిస్టమ్ (Cooling System) ఉండే అవకాశం ఉంది. సౌండ్ క్వాలిటీ కూడా అద్భుతంగా ఉండేలా స్టీరియో స్పీకర్లు ఇవ్వబోతున్నారని సమాచారం.
6.8 అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లే
లీక్‌ల ప్రకారం ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లే ఉండబోతోందట. దీనిలో 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అంటే గేమింగ్‌లో ఫ్రేమ్ డ్రాప్ లేకుండా స్మూత్ అనుభవం, తక్కువ ల్యాగ్, తక్కువ డిలే ఈ ఫీచర్‌తో గేమర్లకు టర్బో స్పీడ్ ఫీలింగ్ వస్తుంది. పబ్జీ, బిజిఎంఐ, ఫ్రీఫ్రీ, కాల్ ఆప్ డ్యూటీ లాంటి గేమ్‌లకు ఇది సరైన ఫోన్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
50ఎంపి ప్రైమరీ కెమెరా
కెమెరా సెటప్‌లో ప్రధానంగా 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉండవచ్చని లీక్‌లు చెబుతున్నాయి. గేమింగ్ ఫోన్‌గా ఉన్నప్పటికీ, ఫోటో, వీడియో క్వాలిటీ కూడా మంచి స్థాయిలో ఉంటుందని అంచనా.
Also Read: iphone: 2027లో ఆపిల్ ఐఫోన్ 20 సిరీస్‌తో సంచలనం.. 20 ఏళ్ల జర్నీకి గ్రాండ్ సెలబ్రేషన్
స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్‌సెట్
ప్రాసెసర్ విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్‌సెట్ ఉండవచ్చని లీక్‌లు చెబుతున్నాయి. ఇది ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్‌లలో ఒకటి. ఈ ప్రాసెసర్ సిపియూ, జిపియూ రెండూ గేమింగ్ పనితీరు కోసం ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేయబడ్డాయి. గేమ్‌లు ఎక్కువ సమయం ఆడినప్పటికీ ఫోన్ వేడెక్కకుండా, స్మూత్‌గా రన్ అవ్వడానికి సహాయం చేస్తుంది.
7000mAh బ్యాటరీ
బ్యాటరీ సామర్థ్యం కూడా గేమర్లను దృష్టిలో పెట్టుకొని పెంచారు. ఈ ఫోన్‌లో 7000mAh బ్యాటరీ ఉండవచ్చని రిపోర్ట్‌లు చెబుతున్నాయి. అంతేకాదు, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే కేవలం 20–25 నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇది నిరంతర గేమింగ్ కోసం పర్‌ఫెక్ట్ ఎంపిక.
సెట్ ఆన్ అలెర్ట్ ఆప్షన్
ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం ధర, విడుదల వివరాలు.
వన్‌ప్లస్ టర్బో ప్రస్తుతం అధికారికంగా విడుదల కాలేదు. ఇది రాబోయే మొబైల్ ఫోన్ గా జాబితాలో ఉంది. వన్‌ప్లస్ టర్బో త్వరలోనే లాంచ్ అవుతుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఇప్పటికే సెట్ ఆన్ అలెర్ట్ ఆప్షన్ ద్వారా లాంచ్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందవచ్చు.
భారత్‌లో ధర ఎంతంటే?
ఈ ఫోన్ ధర విషయానికి వస్తే, భారత మార్కెట్‌లో వన్‌ప్లస్ టర్బో యొక్క అంచనా ధర రూ.39,999 గా ఉంది. అంటే తెలంగాణ, ఆంధ్రాలోను సుమారు రూ.40వేల పరిధిలో ఈ ఫోన్ అందుబాటులోకి రావచ్చు. ఇంత శక్తివంతమైన స్పెసిఫికేషన్లతో ఈ ధర నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది.
ఎప్పుడు రాబోతుంది
ప్రస్తుతం ఇది అంచనా వేసిన ధర మాత్రమే. అధికారిక ధర, లాంచ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. టెక్ నిపుణుల అంచనా ప్రకారం నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ ప్రారంభంలో వన్‌ప్లస్ టర్బో చైనా మార్కెట్లో విడుదల అవుతుందని, ఆ తరువాత భారత మార్కెట్‌లో కూడా లాంచ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. వన్‌ప్లస్ టర్బో ఫోన్ గేమింగ్ ప్రపంచంలో కొత్త చరిత్ర సృష్టించేలా కనిపిస్తోంది.