Jaanvi Ghattamaneni:ఇండస్ట్రీ.. కొత్త వారసులు కోసం ఎదురుచూస్తుంది. ఎన్నో తరాల నుంచి నాలుగు ఫ్యామిలీసే ఇండస్ట్రీని నడుపుతూ వస్తున్నాయి. ఇక అభిమనులు కూడా వారి వారసులు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారసులు అంటే.. సొంత కొడుకు, కూతురు మాత్రమే కాదు.. హీరోల అక్క కొడుకులు, కూతుళ్లు.. తమ్ముడు కొడుకులు, కూతుళ్లు కూడా ఆ ఇంటి వారసులే అని చెప్పొచ్చు.
ఇక ఘట్టమనేని ఇంటి అసలైన వారసుడు, వారసురాలు అంటే మహేష్ బాబు- నమ్రతల కొడుకు, కుమార్తె. కొడుకు గౌతమ్ ప్రస్తుతం ఫిల్మ్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. సితార సోషల్ మీడియాలో స్టార్ అయ్యినప్పటికీ ఇప్పుడప్పుడే ఈ చిన్నది ఇండస్ట్రీలో అడుగుపెట్టే ఛాన్సే లేదు. ప్రస్తుతం ఆమె ఫోకస్ అంతా చదువు మీదనే ఉంది. ఘట్టమనేని కుటుంబం నుంచి వీరు మాత్రమే వారసులా అంటే. కాదు.. ఘట్టమనేని కృష్ణకు ఇద్దరు కొడుకులు.. ఒక కుమార్తె.
మహేష్ బాబు అన్న రమేష్ బాబు. అనారోగ్యంతో మరణించిన. ఆయనకు ఒక కూతురు, ఒక కుమార్తె. ఈ మధ్యనే రమేష్ కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. జయకృష్ణ మొదటి సినిమా దర్శకత్వ బాధ్యతలను ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్. ఇక అన్న తో పాటే చెల్లి కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఘట్టమనేని భారతి.. తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్ల ఎంట్రీకి ముహూర్తం కుదరనుంది.
ఇక ఇప్పుడు మరో ఘట్టమనేని వారసురాలు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. కృష్ణ ముద్దుల కూతురు మంజుల కుమార్తె జాన్వీ సైతం టాలీవుడ్ కు పరిచయం కానుంది. జాన్వీ చిన్నతనంలోనే తల్లి మంజులతో కలిసి నటించింది. మనసుకు నచ్చింది సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన జాన్వీ ఆ తరువాత చదువుపై ఫోకస్ పెట్టింది. ఇక ఇప్పుడు మహేష్ మేనకోడలిగా టాలీవుడ్ కి పరిచయం కానుంది. అందంలో అచ్చు తల్లిని పోలి ఉన్న జాన్వీ.. నటనలో కచ్చితంగా మేనమామను గుర్తుచేస్తుంది అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ కోసం డైరెక్టర్లు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఏ డైరెక్టర్ అమ్మడిని పరిచయం చేస్తారో చూడాలి.

Share