HBD Nagababu:మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నాగబాబు (Nagababu).. మెగా బ్రదర్ గా పేరు దక్కించుకున్న ఈయన.. ఒకప్పుడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత కాలంలో జబర్దస్త్ వంటి కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరించిన ఈయన.. ఈమధ్య రాజకీయాలలో బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈరోజు నాగబాబు పుట్టినరోజు.. ఈ సందర్భంగా నిర్మాతగా ఉన్నప్పుడు ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయం లో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఈరోజు తనను నిలదొక్కుకునేలా చేసిందని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో ఈ విషయాలు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఆ నిర్ణయం వల్ల నాగబాబు జీవితం ఎలా మారిపోయింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
అసలు విషయంలోకి వెళ్తే.. హీరో అవ్వాలనుకున్న నాగబాబు హీరో కాలేక అంజన ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి చిరంజీవితో సినిమాలు చేశారు. అయితే చిరంజీవితో రుద్రవీణ, త్రినేత్రుడు , ముగ్గురు మొనగాళ్లు అంటూ మూడు సినిమాలు చేశాడు కానీ మూడు కూడా డిజాస్టర్ గానే నిలిచాయి. ఆ తర్వాత బావగారు బాగున్నారా సినిమా పాజిటివ్ టాక్ వచ్చినా అనుకున్నంత స్థాయిలో లాభాలు రాలేదు. అన్నయ్యతో సినిమాలు సక్సెస్ కావడం లేదని తమ్ముడు పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ సినిమా చేశారు. కానీ ఇది కూడా అట్టర్ ప్లాఫ్ గానే నిలిచింది. ఇక తర్వాత నెక్స్ట్ జనరేషన్ చూద్దామనుకున్న నాగబాబు.. రామ్ చరణ్ తో ఆరెంజ్ మూవీ చేసి ఏకంగా రోడ్డు మీదకు వచ్చేశారు. ఈ సినిమా కోసం ఆస్తులను అమ్మి మరీ పెట్టుబడిగా పెట్టాడు కానీ డిజాస్టర్ గా నిలవడంతో పూర్తిస్థాయిలో అప్పుల పాలయ్యారు.
ALSO READ:Star Kid’s: ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న స్టార్ కిడ్స్.. ఎవరెవరంటే ?
అప్పటివరకు ఇండస్ట్రీలో నాగబాబుకు ఒక మంచి పేరు ఉండేది. కానీ ఈ చిత్రాలన్నీ డిజాస్టర్ గా నిలవడంతో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి ఏ ఒక్కరు కూడా నాగబాబుకు కోట్లు తెచ్చి పెట్టే సినిమా ఇవ్వలేకపోయారు. ఇక ఆరెంజ్ సినిమాతో ఏకంగా రోడ్డున పడే పరిస్థితి వచ్చేసింది. దాంతో కామెడీ షోలు చేసుకునే స్థాయికి వచ్చేసారు..
ఇకపోతే ఈ అప్పుల నుండి బయటపడాలి అంటే నాగబాబుకు ఒక సరైన సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ ఎవరిస్తారు అనే సమయంలో పవన్ కళ్యాణ్ నాగబాబు కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు. అలా ఐదు కోట్ల సహాయంతో పాటు తన నెక్స్ట్ సినిమాకి వచ్చే రెమ్యూనరేషన్ మొత్తాన్ని కూడా ఇస్తానని మాట ఇచ్చారట. అదే గబ్బర్ సింగ్ సినిమా. ఈ విషయాన్ని నాగబాబు స్వయంగా తెలిపారు. గబ్బర్ సింగ్ లాభాలతో అన్నయ్య అప్పులు తీర్చి మిగతా ఎంత మిగిలితే అంత నువ్వే తీసుకో.. నాకు రెమ్యూనరేషన్ వద్దు అని బండ్ల గణేష్తో పవన్ కళ్యాణ్ చెప్పారట. అలా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక దీంతో నాగబాబు కూడా అప్పులన్నీ తీర్చుకొని గట్టెక్కినట్లు సమాచారం.