Pawan Kalyan Next Movie : టాలీవుడ్ స్టార్ హీరో, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈమధ్య రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న ఈయన గతంలో తాను సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసిన సరే రిలీజ్ అయిన తర్వాత యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజీ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టించింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ అక్కడ కూడా దూసుకుపోతుంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ మరో బ్రారి ప్రాజెక్టులో నటించబోతున్నట్లు సమాచారం. ఆ మూవీకి సంబంధించిన నిర్మాణ సంస్థ నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ నిర్మాణ సంస్థ ఏది? డైరెక్టర్ ఎవరు? అనేది తెలుసుకుందాం..
ఏపీ డిప్యూటీ సీఎం గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాధ్యతలను స్వీకరించారు.. ప్రజల యోగక్షేమాలను ఒక వైపు చూసుకుంటూనే.. తన అభిమానులను సినిమాలతో అలరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ఆయన చేసిన రెండు సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ మూవీ షూటింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా మరో సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు ఇండస్ట్రీలో కోడై కూస్తున్నాయి. చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న KVN ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్‌కు రూ.20 కోట్ల భారీ అడ్వాన్స్ చెల్లించినట్లు సమాచారం.. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ ఎవరనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
Also Read : మెంటలెక్కించే న్యూస్.. మహేష్ ను గుడ్డోడిని చేస్తున్న జక్కన్న.. మ్యాటర్ ఇదే..?
పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో గతంలో గబ్బర్ సింగ్ వచ్చిన విషయం తెలిసిందే.. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేస్తుంది. ఈ కాంబోలో మరో మూవీ రాబోతున్న నేపథ్యంలో పవన్ అభిమానులు మరో హిట్ పక్కా అంటూ అభిప్రాయపడుతున్నారు. అనౌన్స్మెంట్ నుంచే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పై అంచనాలు డబుల్ అయిపోయాయి. పవర్ స్టార్‌తో దర్శకుడు హరీశ్ శంకర్ ఎలా ఎంటర్టైన్ చేస్తాడా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గబ్బర్ సింగ్ సీక్వెన్స్ ఇందులో కొంత కనిపిస్తుంది అని తెలుస్తుంది. ఈ మూవీ షూటింగు ఓజీ కన్నా ముందే పూర్తి కావాల్సి ఉండేది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీగా ఉండడంతో ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.