BigTV English
Advertisement

AI Vacation App: ఇంట్లో ఉంటూనే ప్రపంచంలో ఏ దేశానికైనా ప్రయాణం.. కొత్త ఏఐ యాప్ గురించి తెలుసా?

AI Vacation App: ఇంట్లో ఉంటూనే ప్రపంచంలో ఏ దేశానికైనా ప్రయాణం.. కొత్త ఏఐ యాప్ గురించి తెలుసా?

AI Vacation Fake Photos App| ప్రపంచంలోని అందమైన ప్రదేశాలకు ప్రయాణం చేయడానికి అందరూ ఇష్టపడతారు. అయితే దీనికి చాలా ఖర్చు అవుతుంది. ఉదాహరణకు యూరప్‌ దేశాలకు లగ్జరీ ట్రిప్ చాలా మందికి అందని కల. ఈ సమస్యకు కొంతవరకు ఏఐ టెక్నాలజీ ఒక పరిష్కారం తీసుకొచ్చింది. ప్రయాణాలకు ప్రత్యామ్నాయాన్ని ఒక కొత్త AI యాప్ తీసుకొచ్చింది.


ఈ యాప్.. మీరు ఇంట్లోనే కూర్చొని ఉన్నా.. మీకు విహారయాత్రలో ఉన్నట్టు అనిపించేలా చేస్తుంది. ఈ యాప్ పేరు ఎండ్‌లెస్ సమ్మర్. ఈ టెక్నాలజీ మిమ్మల్ని ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నట్టు చూపిస్తుంది.

ఎండ్‌లెస్ సమ్మర్ యాప్ ఎలా పనిచేస్తుంది?

ఈ యాప్ ఉపయోగించడం చాలా సులభం. ముందుగా మీ సెల్ఫీలు యాప్‌లో అప్‌లోడ్ చేయండి. ఆ తర్వాత పారిస్, న్యూయార్క్, మారిషస్, ఆఫ్రికా, బాలి వంటి టూరిస్ట్ ప్రదేశాల్లో ఏదైనా ఒకటి ఎంచుకోండి. AI వెంటనే మీ రిక్వెస్ట్ ప్రాసెస్ చేస్తుంది. కొన్ని నిమిషాల్లోనే మీరు ఆ ప్రదేశంలో ఉన్నట్టు నేచురల్ ఫోటోలు రెడీ అవుతాయి. ఉదాహరణకు – సముద్ర తీరంలో రిలాక్స్ అవుతూ, సూర్యకాంతి వెనుక ఉండగా, లేదా విదేశీ రూఫ్‌టాప్ కేఫేలో కూర్చొని – అన్నీ రియల్‌గా కనిపిస్తాయి.


ధర, ప్లాన్‌లు

ఎండ్‌లెస్ సమ్మర్ ముందుగా 3 ఉచిత ఫోటోలు ఇస్తుంది. ఎలాంటి ఫీజు చెల్లించకుండా ట్రై చేయవచ్చు. మీకు నచ్చితే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. బేసిక్ ప్లాన్ – 30 ఫోటోలకు $3.99 (సుమారు రూ.330). పెద్ద ప్లాన్ – 150 ఫోటోలకు $17.99 (సుమారు రూ.1,500). అతి పెద్ద ప్లాన్ – 300 ఫోటోలకు $34.99 (సుమారు రూ.2,900). వీటితో మీ వర్చువల్ గా మీ వెకెషన్ కొనసాగించవచ్చు.

సోషల్ మీడియాలో ట్రెండ్

ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తోంది. X (ట్విట్టర్)లో AI ఫోటోలు షేర్ చేస్తున్నారు. చాలా ఫోటోలు అసలు విదేశాల్లో, అందమైన ప్రదేశాల్లో తీసినట్టు కనిపిస్తాయి. భారతదేశంలో ఈ ట్రెండ్ ఎక్కువగా వైరల్ అవుతోంది. మీ ఫీడ్‌లో కూడా మీ ఫ్రెండ్స్ ఫేక్ వెకేషన్‌లో ఉన్న ఫోటోలు కనిపించవచ్చు!

ఫేక్ లైఫ్‌స్టైల్, రియాల్టీ

ఈ టెక్నాలజీ కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఎందుకంటే ఈ యప్ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఫేక్ అనుభవాలను సృష్టిస్తుంది. వ్యక్తులు తమ జీవితాన్ని పూర్తిగా మార్చి చూపించవచ్చు. ఇలాంటి యాప్‌లు సోషల్ మీడియాలో అసత్యాన్ని ప్రోత్సహిస్తున్నాయని.. ఈ టెక్నాలజీ దురుపయోగానికి గురికావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ లగ్జరీ లైఫ్ స్టైల్ తో జీవించాలని ఆశపడతారు. ఇది మానసిక ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు అని చెబుతున్నారు.

ఎండ్‌లెస్ సమ్మర్ యాప్ ఇంటి నుండి ప్రపంచాన్ని చూపిస్తుంది. ఖరీదైన ట్రిప్ లేకుండానే వెకేషన్ ఫీల్ ఇస్తుంది. కానీ ఫేక్ ఫోటోలతో జీవితాన్ని మార్చి చూపించడం సరైనదేనా? మీరు ఈ ట్రెండ్‌ను ట్రై చేస్తారా? లేదా అసలు ప్రయాణానికి వెళ్లడానికి మీరు ఇష్టపడతారా?

Also Read:  ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే

Related News

Google Pixel 10: పిక్సెల్ 10పై భారీ డిస్కౌంట్.. కొత్త ఫోన్‌ఫై రూ.12000 తగ్గింపు.. కొద్ది రోజులు మాత్రమే

Mobiles Launching in Nov 2025: నవంబర్‌లో రాబోతున్న రూ.30వేల లోపు బెస్ట్ ఫోన్లు.. ఏ ఫోన్ బెస్ట్?

BMW 7 Series 2026: ఒకసారి కూర్చుంటే లగ్జరీలో మునిగిపోతారు.. బిఎండబ్ల్యూ 7 సిరీస్ 2026 రివ్యూ

OnePlus Turbo: వన్‌ప్లస్ టర్బో.. గేమర్ల కోసం ప్రత్యేకంగా తయారైన పవర్‌ఫుల్ ఫోన్ వివరాలు ఇవే!

iphone: 2027లో ఆపిల్ ఐఫోన్ 20 సిరీస్‌తో సంచలనం.. 20 ఏళ్ల జర్నీకి గ్రాండ్ సెలబ్రేషన్

ChatGPT Go Free: చాట్‌జిపిటి ప్రీమియం వెర్షన్ ఉచితం.. లిమిటెడ్ ఆఫర్ ఎలా పొందాలంటే

Oppo Find x9: 200MP హాసెల్‌ బ్లాడ్ టెలిఫోటో కెమెరా, లేటెస్ట్ AI ఫీచర్లు, మతిపోగొట్టే Find X9 సిరీస్‌ వచ్చేసింది!

Big Stories

×