ChatGPT Go Free Subscription| ఏఐ ప్రపంచంలో చాట్‌జిపిటి ఒక సంచలనం. ప్రపంచవ్యాప్తంగా చాట్‌జిపిటిని ఉపయోగించే వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. చాట్‌జిపిటి ఉపయోగించేవారిలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. ఈ నెంబర్ వన్ చాట్ బాట్‌కు.. ఉచిత వెర్షన్లతో పాటు పెయిడ్ వెర్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా చాట్‌జిపిటి గో అనే ప్రీమియం వెర్షన్‌లో ఉచిత వెర్షన్ కంటే ఎక్కువ ఫీచర్లున్నాయి. చాట్‌జిపిటిని రూపొందించిన ఓపెన్‌ఏఐ కంపెనీ ఇప్పుడు భారతీయులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది.
కేవంల భారత్‌లో మాత్రమే చాట్‌జీపీటీ గోను మొదటి సంవత్సరం ఉచితంగా అందిస్తుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే – నవంబర్ 4 నుంచి మొదలవుతుంది. ఈ ప్రమోషనల్ పీరియడ్‌లో సైనప్ చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఓపెన్‌ఎఐ మొదటి డెవ్‌డే ఈవెంట్ బెంగళూరులో జరగనుంది. ఈ ఉత్సవాల్లో భాగంగానే ఈ ఆఫర్ ప్రకటించింది. భారత్ మార్కెట్‌కు మరింత పెంచుకోవాలనే ఆలోచనలతోనే ఓపెన్ ఏఐ కంపెనీ ఈ ప్రొమోషనల్ ఆఫర్ ని తీసుకొచ్చింది.
చాట్‌జీపీటీ గో అనేది ఓపెన్‌ఎఐ పెయిడ్ ప్లాన్. ఉచిత ప్లాన్ కంటే చాలా బెటర్ ఫీచర్స్, ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కొత్త జీపీటీ-5 మోడల్‌పై పని చేస్తుంది. ఎక్కువ మెసేజ్‌లు పంపవచ్చు. చాట్స్ కోసం బోనస్ మెమరీ ఉంటుంది. రోజుకు ఎక్కువ ఇమేజ్‌లు జనరేట్ చేయవచ్చు. ఫైల్స్, ఇమేజ్‌లు అప్‌లోడ్ చేసి విశ్లేషణ చేయించవచ్చు. క్లిష్టమైన ప్రశ్నలకు బలమైన సమాధానాలు వస్తాయి. మొత్తం మీద ఇది ఒక పవర్‌ఫుల్ ప్లాన్.
చాట్‌జిపిటికి భారత్ లో భారీ స్థాయిల ఆదరణ లభిస్తోంది. ఓపెన్‌ఎఐ భారత్ సబ్‌స్క్రైబర్లకు ధన్యవాదాలు తెలిపింది. భారత్ క్రియేటర్ల ఉత్సాహాన్ని ఓపెన్ఏఐ గుర్తించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న టెక్ మార్కెట్ ఇండియా. నాలుగు వారాల్లోనే చాట్‌జిపిటి పెయిడ్ సబ్‌స్క్రిప్షన్లు రెట్టింపు అయ్యాయి. ఎక్కువ మందికి అడ్వాన్స్‌డ్ ఏఐ అందించాలనే ప్లాన్‌తో ఓపెన్ ఏఐ ముందుకు సాగుతోంది.
చాట్‌జీపీటీ టీమ్ లీడర్ నిక్ టర్లీ ఈ ఆఫర్ గురించి చెప్పారు. “చాట్‌జీపీటీ గోను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం” అని తెలిపారు. భారత్‌లోని అన్ని వర్గాల వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీని వల్ల అత్యాధునిక ఏఐని అందరూ త్వరగా ఉపయోగించవచ్చు. దేశంలో లెర్నింగ్, ఇన్నోవేషన్‌కు ఈ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ బూస్ట్ ఇస్తుంది.
భారత్‌లో ఎవరైనా ఈ ఆఫర్ తీసుకోవచ్చు. నవంబర్ 4 నుంచి సైనప్ చేస్తే చాలు. ఇప్పటికే చాట్‌జీపీటీ గో సబ్‌స్క్రైబర్లకు కూడా ఒక సంవత్సరం ఉచితం. ఇంకా పూర్తి వివరాలు ఓపెన్ ఏఐ ఈవెంట్ తరువాత స్పష్టమవుతాయి. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు.
ఓపెన్‌ఎఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ భారత్ తమకు ఎంతో ముఖ్యమని ఇటీవలే ధృవీకరించారు. యూఎస్ తర్వాత ఇండియా రెండో అతిపెద్ద మార్కెట్. కానీ ఇక్కడ పెయిడ్ ప్లాన్లు మానిటైజ్ చేయడం కష్టం. ఆప్ ఫిగర్స్ డేటా ప్రకారం, గత నెలలో 29 మిలియన్ డౌన్‌లోడ్స్ ఉన్నాయి . కానీ ఇన్-యాప్ పర్చేజ్‌లు కేవలం $3.6 మిలియన్ మాత్రమే ఉన్నాయి. అందుకే ఈ ఆఫర్‌తో యూజేజ్, అడాప్షన్ పెరుగుతుందని ఓపెన్ ఏఐ అసలు ప్లాన్.
ఈ ఆఫర్‌తో భారత్‌లో ఏఐ వినియోగం మరింత విస్తరిస్తుంది. విద్యార్థులు, క్రియేటర్లు, వ్యాపారాలు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. నవంబర్ 4 నుంచి సైనప్ చేయడం మరచిపోకండి.
Also Read: ఐఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతోందా? ఈ సింపుల్ సెట్టింగ్స్‌తో సమస్యకు చెక్