చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం Oppo అదిరిపోయే సిరీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బార్సిలోనాలో జరిగిన టెక్ ఈవెంట్ లో Oppo Find X9 సిరీస్ ను ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. 740 మిలియన్ల గ్లోబల్ యూజర్ బేస్ ను కలిగి ఉన్న Oppo.. ఈ సిరీస్ తో ప్రీమియం స్మార్ట్ ఫోన్ విభాగంలో టాప్ లో నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ లో ఇమేజింగ్, AI ఫంక్షన్లు, బ్యాటరీ విశ్వసనీయత, క్రాస్ డివైస్ కనెక్టివిటీకి ప్రాధాన్యతనిస్తూ ఈ స్మార్ట్ ఫోన్ ను రూపొందించింది. ఈ స్మార్ట్ ఫోన్ యూజర్లకు క్రేజీ ఎక్స్ పీరియెన్స్ ను అందివ్వబోతోంది Oppo. న్యూ జెనరేషన్ ప్రీమియం ఫోన్ కొనుగోలుదారులు ఇమేజింగ్, AI, పవర్ ఎఫిషియెన్సీ, కనెక్టివిటీని ఒకే ప్రొడక్ట్ లో లింక్ చేసే డివైజెస్ గురించి ఆలోచిస్తున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా ఈ స్మార్ట్ ఫోన్ ను రూపొందించినట్లు Oppo ఓవర్సీస్ CMO లింగ్ లియు వెల్లడించారు. Find X9 సిరీస్ మొబైల్ ఇమేజింగ్ సిస్టమ్ కు సంబంధించి నెక్ట్ లెవల్ కు లీడర్ గా ఉండాలని భావిస్తున్నట్లు తెలిపారు.
Find X9 ప్రో తక్కువ లైటింగ్ సహా విభిన్న లైటింగ్ కండీషన్స్ లోనూ హెచ్ డీ ఫోటోలను అందిస్తుంది. ఇందుకోసం 200MP హాసెల్ బ్లాడ్ టెలిఫోటో కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. Find X9 లైనప్ ఫోన్ ను వ్యక్తిగత, వృత్తిపరమైన ఉపయోగం కోసం ఉద్దేశించిన రూపొందించారు. కంటెంట్ ప్రొడ్యూసింగ్ డివైజ్ గానూ ఈ స్మార్ట్ ఫోన్ పని చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇక సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే, ColorOS 16 పోర్ట్రెయిట్ లైటింగ్ నియంత్రణ కోసం AI పోర్ట్రెయిట్ గ్లో, ఐడియేషన్, కంటెంట్ ఆర్గనైజేషన్ కోసం AI మైండ్ స్పేస్ ను అందుబాటులోకి తెస్తుంది. ఈ సిరీస్ ఇంటిగ్రేటెడ్ అప్ డేటెడ ప్రైవసీ కంట్రోల్స్ ను కలిగి ఉంటుంది.
Find X9 సిరీస్ తో కంపెనీ తన ప్రపంచ రిటైల్ వ్యూహాన్ని కూడా మార్చాలని భావిస్తోంది. టిక్ టాక్ స్టోర్ ఫ్రంట్స్, లైవ్ స్ట్రీమింగ్ ఛానెల్స్ తో సహా యువ కొనుగోలుదారులు ఉపయోగించే ప్లాట్ ఫామ్ లలో దీని ఇ-కామర్స్ మరింతగా అందుబాటులోకి తీసుకురావాలని Oppo భావిస్తోంది.
ఇక ‘మేక్ యువర్ మూమెంట్’ బ్రాండ్ ప్లాట్ ఫామ్ స్పోర్ట్స్, కలర్చర్ భాగస్వామ్యాలకు విస్తరించింది. Oppo UEFA ఛాంపియన్స్ లీగ్ కు అధికారిక స్మార్ట్ ఫోన్ భాగస్వామిగా కొనసాగుతోంది. స్పెయిన్, మెక్సికో, థాయిలాండ్ అంతటా డిస్కవరీ ఫర్ ది కల్చర్ ఇన్ ఎ షాట్ చొరవతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. అదే సమయంలో ఒప్పో ఫోటోగ్రఫీ అవార్డ్స్ 2025కి సంబందించి నవంబర్ 20 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పిస్తోంది.
Read Also: సామ్ సంగ్ లవర్స్ కు క్రేజీ న్యూస్, ట్రై ఫోల్డ్ ఆండ్రాయిడ్ యాప్ రెడీ, రిలీజ్ ఎప్పుడంటే?