BigTV English

Traffic jams : ట్రాఫిక్ జామ్స్ ఎందుకు ఏర్పడుతున్నాయి..? తగ్గించడం ఎలా..?

Traffic jams : ట్రాఫిక్ జామ్స్ ఎందుకు ఏర్పడుతున్నాయి..? తగ్గించడం ఎలా..?

Traffic jams : ఇంతకు ముందుతో పోలిస్తే రోడ్లు ఇప్పుడు అంత ఇరుకుగా లేవు. హైవేలు లాంటివి వచ్చి ఎక్కువ వాహనాలు వెళ్లడానికి సులువైన మార్గాలు ఏర్పడ్డాయి. అయినా కూడా ట్రాఫిక్ జామ్స్ అనేవి ఆగడం లేదు. హైవేలాంటి వాటిలో కూడా ఎప్పుడు చూసినా ఎక్కువ వాహనాలే కనిపిస్తున్నాయి. ఇక సిటీ మధ్యలో పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని వెనుక ఉన్న కారణాలపై పరిశోధకులు తాజాగా పరిశోధనలు చేశారు.


గత కొన్నేళ్లుగా ఇతర దేశాలతో పోలిస్తే అమెరికన్లు ఎక్కువగా ట్రాఫిక్ జామ్స్‌లో ఇరుక్కుంటున్నారని సర్వేలు చెప్తున్నాయి. 2022లో అమెరికాలో కార్లు డ్రైవ్ చేసేవారు దాదాపుగా 51 గంటలు ట్రాఫిక్ జామ్‌లోనే గడిపేశారని తేలింది. ముఖ్యంగా చికాగోలో అయితే ఏకంగా 155 గంటల పాటు ట్రాఫిక్ జామ్స్‌లో ఇరుక్కుపోయారని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెట్రో సిటీలలో పోలిస్తే చికాగో అనేది టాప్ స్థానంలో ఉందని సర్వేలో వెల్లడయ్యింది.

ఇప్పటివరకు అసలు ఈ ట్రాఫిక్ జామ్స్ ఎందుకు ఇంత విపరీతంగా పెరిగిపోతున్నాయి అనేదానికి సరైన కారణం దొరకలేదు కానీ ట్రాఫిక్ జామ్స్‌లో ఇరుక్కోవడం అనేది మనుషులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈ పరిస్థితికి ‘ఫాంటమ్ జామ్’ అని పరిశోధకులు పేరుపెట్టారు. ఫాంటమ్ జామ్ అనేది ముందుగా ఒక బిజీ రోడ్డులో ఒక వాహనం స్లో అయినప్పుడు ఆటోమేటిక్‌గా దాని తర్వాత మిగతా వాహనాలు కూడా స్లో అవుతూ వస్తాయి. అలా ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతుంది.


ట్రాఫిక్ జామ్ అనేది మొదలవ్వడానికి కేవలం ఒక్క వాహనమే కారణమవుతుందని పరిశోధకులు నిర్ధారించారు. ట్రాఫిక్ వేవ్ అనేది సాఫీగా సాగినప్పుడు జామ్స్ జరగవని, అది కొంచెం స్లో అయినా కూడా జామిటాన్‌కు దారితీస్తుందని తెలిపారు. జామిటాన్స్ అనేవి రద్దీలో రోడ్డులో వాహనాలు ఆగుతూ వెళ్లడం అని వారు వివరించారు. అంతే కాకుండా ట్రాఫిక్ వేవ్స్ అనేవి సాఫీగా సాగకపోవడాన్ని జామిటాన్స్ అంటారని తెలుస్తోంది. ముందుగా ఒక కారుతో ఈ ట్రాఫిక్ జామ్ అనేది ప్రారంభమయిన తర్వాత మెల్లగా అందరు డ్రైవర్ల ప్రవర్తన దీనికి కారణమవుతుందని పరిశోధకులు చెప్తున్నారు.

సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు లేదా ఎలక్ట్రిక్ కార్లు అనేవి ఎక్కువగా ట్రాఫిక్ జామ్స్‌కు కారణమవ్వకుండా సాఫీగా సాగిపోయేలా చేస్తాయని పరిశోధకులు నిర్ధారించారు. అలా కాకపోయినా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ చెప్పినదాని ప్రకారం ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడినప్పుడు మన ముందు ఉన్న వాహనం కంటే 3 లేదా 4 సెకండ్లు దూరంలో ఉండాలని సూచించారు. అంతే కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క వాహనాన్ని ఉపయోగించకుండా కార్ పూలింగ్ లాంటివి చేసినా.. ట్రాఫిక్ జామ్స్‌కు ఎంతోకొంత చెక్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related News

OnePlus Phone: గేమింగ్‌కి బెస్ట్ ఆప్షన్.. ఆండ్రాయిడ్ 15 సపోర్ట్‌తో వన్‌ప్లస్ నార్డ్ 5 ఎంట్రీ

Smartphone Comparison: షావోమీ 15T ప్రో vs ఐఫోన్ 17 ప్రో.. ఆపిల్‌కు దడ పుట్టిస్తున్న షావోమీ

Free Galaxy Watch 8: కొత్త గెలాక్సీ స్మార్ట్‌వాచ్ ఫ్రీగా కొట్టేసే ఛాన్స్.. ఆ పనిచేస్తే చాలు..

iPhone Offer: రూ.25,000 తగ్గిన iPhone 16 ప్లస్.. ఇప్పుడు కొనడానికి బెస్ట్ టైమ్!

Laptop Below Rs10000: లెనోవో సూపర్ ల్యాప్‌టాప్ రూ.10000 కంటే తక్కువ.. ఏకంగా 73 శాతం డిస్కౌంట్

Samsung Galaxy: సామ్ సంగ్ గ్యాలక్సీ F17 5G లాంచ్.. గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో పవర్ ఫుల్ ఎంట్రీ

Jio Mart iPhone offer: ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌కి పోటీగా జియోమార్ట్ దిమ్మతిరిగే ఆఫర్.. iPhone కేవలం రూ.44,870 మాత్రమే

ATM PIN Safety: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!

Big Stories

×