BigTV English

Rogue meteor in sky: నేలరాలిన అందమైన తోకచుక్క.. ఫోటోలు వైరల్.

Rogue meteor in sky: నేలరాలిన అందమైన తోకచుక్క.. ఫోటోలు వైరల్.

Rogue meteor in sky: అప్పుడప్పుడు అంతరిక్షంలో జరిగే కొన్ని వింతలు మనకు భూమిపై నుండి చూస్తే కనిపిస్తాయి. అసలు అది ఏంటి అని అర్థం కాకపోయినా చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి తోకచుక్క. తోకచుక్కను చూస్తే అదృష్టమని, దానిని చూసి ఏది కోరుకున్నా జరుగుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో ఎవరూ నిర్ధారించకపోయినా.. చూడడానికి మాత్రం తోకచుక్క అనేది చాలా అందంగా ఉంటుంది. అలాంటిదే తాజాగా ఆస్ట్రేలియాలో కనిపించింది.


ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండర్స్‌లో అందమైన తోకచుక్క ఆకాశంలో మెరిసింది. ఇప్పటివరకు ఇలాంటి ఒక అద్భుతాన్ని చూడలేదని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ఒక ప్రకాశవంతమైన ఫైర్‌బాల్ లాగా కనిపించిందని వారు చెప్తున్నారు. ఇది కనిపించింది కొద్ది క్షణాలే అయినా చూడడానికి చాలా అందంగా ఉందని తెలిపారు. అంతే కాకుండా ఇది ఆకాశం నుండి నేలకు తాకినప్పుడు తెలుపు, ఆరెంజ్ మిక్స్ అయిన కలర్‌లో కనిపించిందని చూసినవారు చెప్తున్నారు. ఆపై అది నేలపై ఎక్కడో క్రాష్ అయిందని వారు భావిస్తున్నారు.

ఆ అద్భుతాన్ని ఆస్ట్రేలియా ప్రజలు రాత్రి 9.22 గంటలకు చూశారు. క్వీన్స్‌ల్యాండ్స్‌లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కేవలం ఒక ప్రకాశవంతమైన లైట్‌ను మాత్రమే చూసినట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా క్వీన్స్‌ల్యాండ్స్‌లో ఉన్న ప్రజలు ఈ తోకచుక్కను చూడగానే వెంటనే తమ ఫోన్స్‌లో బంధించారు. కొందరు వారు తీసిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ కూడా చేశారు. కొంతమంది మాత్రం ఇది చాలా అందంగా ఉంది కానీ అసలు ఏంటిది అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పోస్టులు చేశారు.


ఈ తోకచుక్క ఎక్కడ ల్యాండ్ అయ్యిందని తెలుసుకునే విషయంలో ప్రస్తుతం శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. వారికి అందిన సమాచారం ప్రకారం ఇది క్రోయ్‌డాన్ అనే ప్రాంతంలో పడినట్టుగా వారు భావిస్తున్నారు. క్రోయ్‌డాన్‌లో నివసించే ప్రజలు తమకు ఒక పెద్ద శబ్దం వినపడిందని, ఒక్కసారిగా తమ ఇళ్లులు కూడా వణికాయని చెప్పడంతో అక్కడే ఆ తోకచుక్క పడి ఉంటుందని శాస్త్రవేత్తలు సందేహిస్తున్నారు. కేవలం క్షణాల్లో మాయమయిన ఈ అందమైన తోకచుక్కను చూసే అదృష్టం కొంతమందికే కలిగిందని చూడనివారు సోషల్ మీడియాలో వాపోతున్నారు.

Tags

Related News

OOppo New Launch: 7000mAh బ్యాటరీ కెపాసిటీ.. ఒప్పో యూజర్లను ఆకట్టుకునే ఫీచర్లు.. ధర కూడా!

Vivo New Launch: వావ్.. అనిపిస్తున్న వీవో ఫోన్.. ఫోటో లవర్స్ కోసం ప్రత్యేక ఫీచర్లు

OnePlus Phone: గేమింగ్‌కి బెస్ట్ ఆప్షన్.. ఆండ్రాయిడ్ 15 సపోర్ట్‌తో వన్‌ప్లస్ నార్డ్ 5 ఎంట్రీ

Smartphone Comparison: షావోమీ 15T ప్రో vs ఐఫోన్ 17 ప్రో.. ఆపిల్‌కు దడ పుట్టిస్తున్న షావోమీ

Free Galaxy Watch 8: కొత్త గెలాక్సీ స్మార్ట్‌వాచ్ ఫ్రీగా కొట్టేసే ఛాన్స్.. ఆ పనిచేస్తే చాలు..

iPhone Offer: రూ.25,000 తగ్గిన iPhone 16 ప్లస్.. ఇప్పుడు కొనడానికి బెస్ట్ టైమ్!

Laptop Below Rs10000: లెనోవో సూపర్ ల్యాప్‌టాప్ రూ.10000 కంటే తక్కువ.. ఏకంగా 73 శాతం డిస్కౌంట్

Samsung Galaxy: సామ్ సంగ్ గ్యాలక్సీ F17 5G లాంచ్.. గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో పవర్ ఫుల్ ఎంట్రీ

Big Stories

×