Big Stories

Pregnant Women:- గర్భవతులపై తీవ్ర ప్రభావం చూపించే అలాంటి ఆహారం..

Pregnant Women:- చిన్నప్పటి నుండే హెల్తీ డైట్ అనేది మెయింటేయిన్ చేయడం చాలా ముఖ్యం. మనం తినే ఆహారంపైనే చాలావరకు మన ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుందని వైద్యులు చెప్తుంటారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో డైట్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఏది తినాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఇవన్నీ వైద్యులు కూడా హెచ్చరిస్తుంటారు. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు తినకూడని ఒక ఆహార పదార్థం గురించి శాస్త్రవేత్తలు ఇటీవల బయటపెట్టారు.

- Advertisement -

మామూలుగా ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల మెటాబోలిజంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతే కాకుండా ఒబిసిటీ, లివర్ వ్యాధులు, క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులు కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో ఇలాంటి ఆహారం తినడం వల్ల టేస్ట్ ప్రాధాన్యతలు మారిపోవడంతో పాటు మెటాబోలిజంపై మరింత ఎక్కువగా ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ చాలావరకు ఇళ్లల్లో ఎక్కువ ఫ్యాట్ ఫుడ్‌ను పిల్లలతో పాటు, తల్లిదండ్రులు, గర్భవతులు కూడా తింటారని వారు గమనించారు.

- Advertisement -

ఎక్కువ ఫ్యాట్ ఫుడ్‌ను తినే తల్లులు వారి పిల్లలకు కూడా ఎక్కువశాతం అవే పెట్టడానికి ఇష్టపడతారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలోనే కాకుండా మొదటినుండి కూడా ఇలాంటి ఆహార పదార్థాల వల్ల ఎలాంటి ప్రభావం కలుగుతుందని టోక్యోకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధించి చూశారు. ప్రెగ్నెంట్ మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువగా హై ఫ్యాట్ ఫుడ్ తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటని ప్రత్యేకంగా వారి పరిశోధనలు కొనసాగాయి. దీనికోసం వారు ఎలుకలను ఎంచుకున్నారు.

ఈ పరిశోధనల్లో భాగంగా కొన్ని ప్రెగ్నెంట్ ఎలుకలను, అప్పుడే పుట్టిన ఎలుకలను ఎంపిక చేసుకున్నారు. అందులో కొన్నింటికి ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారాన్ని అందించి, మరికొన్నింటికి పర్ఫెక్ట్ డైట్‌ను అందించారు శాస్త్రవేత్తలు. కొన్నాళ్ల వరకు వాటికి అదే ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. దాని వల్ల వాటిలో కలిగిన టేస్ట్ ప్రాధాన్యత మార్పులను గమనించారు. ఒక ఆహారం పదార్థం అనేది రుచిగా అనిపిస్తే మెదడులోని సర్క్యూట్స్ యాక్టివేట్ అయ్యి మళ్లీ మళ్లీ అదే ఆహారాన్ని కోరుకుంటున్నాయని వారు ఈ పరిశోధనల్లో తేల్చారు.

ఈరోజుల్లో ఆరోగ్యకరం కాదని తెలిసినా.. చాలామంది జంక్ ఫుడ్‌ను ఇష్టపడడానికి కూడా ఇదే కారణమని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఒకసారి ఆ రుచికి అలవాటు పడిన తర్వాత, అది మనకు నచ్చిన తర్వాత మెదడు ఆ రుచిని మళ్లీ మళ్లీ కోరుకుంటుంది అన్నారు. కానీ ఇది అన్ని సందర్భాల్లో అంత ఆరోగ్యకరం కాదని వారు బయటపెట్టారు. అందుకే రుచిగా అనిపించకపోయినా.. డైట్‌ను ఫాలో అవ్వడం.. అది కూడా గర్భవతులు మంచి డైట్‌ను ఫాలో అవ్వడం ముఖ్యమని సూచించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News