Big Stories

RevanthReddy: రేవంత్‌కు నో ఎంట్రీ.. కొత్త సచివాలయం కొందరికేనా..?

revanth reddy

RevanthReddy: తెలంగాణ కొత్త సచివాలయం. అద్భుతమైన భవనం. అత్యద్భుతమైన వసతులు. ఏకంగా 6వ అంతస్థు మొత్తం సీఎం కేసీఆర్‌కే. గ్రాండ్‌గా ఓపెనింగ్ చేశారు. మొదటిరోజు ఈవెంట్ ముగిసింది. రెండవ రోజే సర్కారు అసలు నైజం బయటపడింది.

- Advertisement -

కొత్త సచివాలయం స్టార్ట్ అయింది కాదా.. అధికారులంతా అందుబాటులో ఉంటారు కదాని.. ఓ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి ఫిర్యాదు ఇచ్చేందుకని ఎంపీ, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సెక్రటేరియట్‌కు బయలుదేరారు. ORRను అతితక్కువ ధరకే ఓ ముంబై కంపెనీకి కట్టబెట్టడంపై HMDA ఉన్నతాధికారిని కలిసి ఓ లేఖ ఇవ్వాలని అనుకున్నారు. అయితే.. రేవంత్ వస్తున్నారనే విషయం తెలిసి.. పెద్ద సీనే క్రియేట్ అయింది.

- Advertisement -

సెక్రటేరియట్ విజిటర్స్ గేటును మూసేశారు సచివాలయ భద్రతా సిబ్బంది. దారికి అడ్డుగా బారికేడ్లు పెట్టారు. సెక్యూరిటీ టైట్ చేశారు. అయితే, రేవంత్‌రెడ్డి సెక్రటేరియట్‌కి చేరుకోకముందే మార్గమధ్యలోనే ఆయన వాహనాన్ని నడిరోడ్డుపై ఆపేశారు పోలీసులు. సచివాలయానికి వెళ్లడానికి అనుమతి లేదంటూ.. అల్లంత దూరాన్నే అడ్డుకున్నారు.

పోలీసుల తీరుపై రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారులో నుంచే డీసీపీకి ఫోన్ చేసి.. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ముందస్తు అనుమతి లేదని.. ఆయన కలవాలనుకున్న అధికారి అక్కడ లేరని.. ఇలా తన వెర్షన్ చెప్పారు డీసీపీ. దీనిపై రేవంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ ఎంపీ అయిన తనకు ఎలాంటి అనుమతి అవసరం లేదని.. ఎంపీగా తన ఐడెంటిటీ కార్డే అన్నిటికీ ఎంట్రీ పాస్ అని స్పష్టం చేశారు. తాను HMDA ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి ఓ లేఖ ఇస్తే తప్పేంటని.. తనను లోనికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు.

నడిరోడ్డు మీద రేవంత్ కారును ఆపేయడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ తర్వాత పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడి.. HMDA డిపార్ట్‌మెంట్ ఇంకా షిఫ్ట్ కాలేదని.. సెక్రటరీ అరవింద్ కుమార్ సైతం మరో కార్యాలయంలో ఉన్నారంటూ.. సచివాలయానికి కాకుండా లక్డికపూల్ లోని ఆఫీసుకు రేవంత్‌రెడ్డిని తీసుకెళ్లారు పోలీసులు.

తాజా పరిణామంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సచివాలయం అందరికోసం కాదా? కొందరి కోసమేనా? అని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ వారికే ఎంట్రీ ఉంటుందా? విపక్షాలను లోనికి రానివ్వరా? ఓ ఎంపీకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక సామాన్యులు సెక్రటేరియట్‌లో అడుగుపెట్టగలరా? అని నిలదీస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News