Shahidi Afridi : ఆసియా కప్ 2025 లో భాగంగా సెప్టెంబర్ 28న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ పాకిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అలాగే టీమిండియా అభిమానులు సైతం టీమిండియా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిది అఫ్రిది టీమిండియా పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా షాహిన్ అఫ్రిది ఫైనల్ మ్యాచ్ లో 5 వికెట్లు తీయడం పక్కా అంటూ కామెంట్స్ చేశాడు.
Also Read : Asia Cup 2025 : పాకిస్తానీల అరాచకాలు.. గ్రౌండ్ లోనే లేడీ అభిమాని ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు!
అంతేకాదు.. ఫైనల్ షాహిన్ అఫ్రిది 5 వికెట్లు తీయడంతో పాటు పాకిస్తాన్ ఆసియా కప్ 2025 విజయం సాధిస్తుందని.. దీంతో ఇండియా కి నిద్ర లేకుండా చేస్తామని సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం షాహిది అఫ్రిది చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరోవైపు మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. టీమిండియా క్రికెటర్ అభిషేక్ శర్మ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ మనిషి కాడు.. వాడు ఓ జంతువు అని సంచలన కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు తన క్రికెట్ రోజుల్లో అక్తర్ చాలా కోపంతో కనిపించేవాడు. 2025 ఆసియా కప్ లో ఇండియా- పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ కి ముందు ఇదే స్వభావంతో రెచ్చిపోయాడు. సెప్టెంబర్ 28న జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ కి ముందు షోయబ్ అక్తర్ పాకిస్తాన్ జట్టుకు కిల్లర్ వైఖరీని అవలంభించాలని సందేశం ఇచ్చాడు. భారత జట్టు గర్వాన్ని అణిచివేసే ఉద్దేశంతోనే మైదానంలోకి రండి అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే అభిషేక్ శర్మ క్రీజులో ఉంటే పాకిస్తాన్ తట్టుకోవడం చాలా కష్టమే అని వెల్లడించాడు.
టీమిండియా లీగ్ దశలో, సూపర్ 4 దశలో గెలిచిందని.. కానీ ఫైనల్ లో గెలవదని పలువురు అభిమానులు కూడా పేర్కొన్నారు. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లకు, అభిమానులకు టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. సెప్టెంబర్ 28న పాకిస్తాన్ పై మ్యాచ్ గెలిస్తే.. రికార్డు సృష్టిస్తుంది. పాకిస్తాన్ మాజీ ఆటగాళ్ల ప్రకటనలు ఎంత వరకు ప్రభావం చూపుతాయో తెలియదు కానీ ఇండియా-పాక్ ఫైనల్ మ్యాచ్ ఉత్సాహాన్ని పెంచుతోంది. 41 ఏళ్ల తరువాత ఆసియాకప్ చరిత్రలో తొలిసారిగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్టు ఫైనల్ లో తలపడుతున్నాయి. ప్రధానంగా 2025 ఆసియా కప్ లో సెప్టెంబర్ 14న గ్రూపు దశలో భారత్ – పాకిస్తాన్ మొదటిసారి తలపడ్డాయి. ఆ తరువాత వారం రోజుల తరువాత సెప్టెంబర్ 21న సూపర్ 4 దశలో తలపడ్డాయి. మళ్లీ ఆ తరువాత వారం రోజుల తరువాత సెప్టెంబర్ 28 న ఆదివారం రోజు టీమిండియా-పాకిస్తాన్ తలపడనున్నాయి. రెండు మ్యాచ్ లు ఆదివారం జరగడం.. అందులో రెండింటిలో కూడా టీమిండియానే ఘన విజయం సాధించడం విశేషం. ఫైనల్ లో కూడా టీమిండియానే విజయం సాధిస్తుందని అభిమానులు జోస్యం చెబుతున్నారు.