Honor 200 Lite 5G Launch Date: అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్లలో హానర్ ఒకటి. ఎన్నో కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు మరో ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. కంపెనీ ఈ ఏడాది జూన్‌లో Honor 200 సిరీస్‌లో Honor 200 Lite 5G, Honor 200 5G, Honor 200 Pro 5G స్మార్ట్‌ఫోన్లను ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ చేసింది. ఈ హానర్ 200 సిరీస్‌లోని బేస్, ప్రో వేరియంట్‌లు భారతదేశంలో కూడా లాంచ్ చేయబడ్డాయి.
ఇక ఇప్పుడు Honor 200 సిరీస్‌లో లైట్ వేరియంట్ భారతదేశంలోకి రావడం సిద్ధమైంది. తాజాగా ఈ Honor 200 Lite 5G స్మార్ట్‌ఫోన్ ఇండియా లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. రాబోయే స్మార్ట్‌ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్‌లు, ముఖ్య ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. అందువల్ల Honor 200 Lite 5G భారతీయ వేరియంట్ గ్లోబల్ వెర్షన్‌కు సమానంగా ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Honor 200 Lite 5G Launch Date
Honor 200 Lite 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో సెప్టెంబర్ 19న మధ్యాహ్నం 12 గంటలకు IST లాంచ్ అవుతుంది. అనంతరం ఈ ఫోన్ అమెజాన్, ఎక్స్‌ప్లోర్ హానర్ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ మెయిన్‌లైన్ స్టోర్‌ల ద్వారా దేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. దీని కలర్ ఆప్షన్ల విషయానికొస్తే.. Honor 200 Lite 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ వేరియంట్ సియాన్ లేక్, మిడ్‌నైట్ బ్లాక్, స్టార్రీ బ్లూ వంటి కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.
Also Read: 200MP కెమెరా, 6000 mAh బ్యాటరీతో కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్లు కెవ్ కేక!
Honor 200 Lite 5G Specifications
Honor 200 Lite 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది భారతదేశంలో 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ప్రారంభించబడుతుంది. f/1.75 ఎపర్చరు ఉన్న ప్రైమరీ సెన్సార్, f/2.2 ఎపర్చరుతో డెప్త్ సెన్సార్, f/2.4 ఎపర్చరుతో మాక్రో షూటర్ వంటివి ఉంటాయి. అదే సమయంలో ఫోన్ ముందు భాగంలో సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు ‘సెల్ఫీ లైట్’ని కూడా కలిగి ఉంటుంది. హానర్ 200 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ SGS 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో వస్తుందని ప్రకటించబడింది. ఈ హ్యాండ్‌సెట్ 3240Hz PWM డిమ్మింగ్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 8.0పై పని చేస్తుంది. Honor 200 Lite 5G గ్లోబల్ వేరియంట్ విషయానికొస్తే.. ఇది MediaTek Dimensity 6080 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. అలాగే 35W వైర్డ్ సూపర్‌ఛార్జ్ సపోర్ట్‌తో 4500mAh బ్యాటరీతో వస్తుంది. 6.7-అంగుళాల పూర్తి-HD+ AMOLED స్క్రీన్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. వెనుక కెమెరా యూనిట్‌లో 5మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి.