BigTV English

Bunny Vas: బన్నీ వాస్ ని టార్గెట్ చేశారా? మీరు నా వెంట్రుక, తల మీద వెంట్రుకే తీసా అక్కడిది కూడా తీయగలను

Bunny Vas: బన్నీ వాస్ ని టార్గెట్ చేశారా? మీరు నా వెంట్రుక, తల మీద వెంట్రుకే తీసా అక్కడిది కూడా తీయగలను

Bunny Vasu: బన్నీ వాసు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అల్లు అర్జున్ స్నేహితుడిగా, నిర్మాతగా చాలామందికి పరిచయం. జిఏ 2 బ్యానర్స్ పైన ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన ఘనత బన్నీ వాసుకి ఉంది. రీసెంట్ గానే లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో మంచి సక్సెస్ కూడా అందుకున్నారు.


ఇకపోతే బన్నీ వాసు ఎప్పుడు స్టేజ్ పైన మాట్లాడినప్పుడు చాలా సంస్కారంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మొదటిసారి కంప్లీట్ బరస్ట్ అయిపోయారు. తాను నిర్మిస్తున్న మిత్రమండలి సినిమా అక్టోబర్ 16న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో బన్నీ వాసు మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

సినిమాను తొక్కితేనే ఎదుగుతారా?

బన్నీ వాసు తన స్పీచ్ ని చాలా పద్ధతిగా స్టార్ట్ చేశారు. అయితే ముందు ఒక మీమ్ గురించి ప్రస్తావని తీసుకొచ్చారు. ఆ మీమ్ లో ఎక్కడ నవ్వాలో కూడా చెప్పండి అని ఉండటం బన్నీ వాసు ను విపరీతంగా హర్ట్ చేసింది. ముందు సినిమాకి రండి ఖచ్చితంగా మీకు నవ్వొస్తుంది అని సైలెంట్ గానే చెప్పారు.


ఒక సినిమాను తొక్కితేనే పక్క సినిమా ఎదుగుద్ది. లేదు నేను ఒక సినిమాకి నెగిటివ్ ట్రోల్ చేస్తేనే పక్క సినిమా ఎదుగుద్ది అంటే అది మీ కర్మ. ఎవరు ఏమీ చేయలేం. ఇక్కడ సినిమా బాగుంటే చూస్తారు లేకపోతే చూడరు. మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఫైనల్ గా ఆడియన్స్ జడ్జిమెంట్ కి, మనం ఎవరు ఒక సినిమాకి డబ్బులు పెట్టి ఇంకో సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్ చేయించడానికి.?

బ్రదర్ మనం అందరం ఇక్కడున్నది ఎదగడానికి, కష్టపడడం, ఎదుగుదాం, కలిసి ఎదుగుదాం, అంతే తప్ప ఒక సినిమా వస్తే నెగిటివ్ కామెంట్స్ పెట్టిద్దాం, నెగిటివ్ ప్రోపగండా చేద్దాం అనుకుంటే పైన ఆ దేవుడు ఉన్నాడు. చూసే ప్రేక్షకులు ఉన్నారు.

అది నాకు వెంట్రుక 

ఇది మిత్ర మండలి స్టేజ్ నేను చాలా నవ్వుతూ మాట్లాడదాం అనుకున్నా. కానీ యుద్ధం చేయడంలో తప్పులేదు. ఆ యుద్ధానికి ఒక ధర్మం ఉండాలి. నేను కూడా ఎప్పుడూ కాంపిటీషన్లోనే ఉండాలి అని కోరుకుంటాను. నా ఫైట్ ఎప్పుడూ ధర్మం గానే ఉంటుంది.

నేనైతే 100% అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాను. నా సినిమా బాగోకపోతే బాగున్న సినిమా ఆడాలి అనుకుంటాను. ఎందుకంటే మనం 10 సినిమాలు చేసిన, 15 సినిమాలు చేసిన ప్రతి సినిమా కూడా ఆడేయాలి అనుకోవటం తప్పు. ఒక్కోసారి మన సినిమా బాగుండకపోవచ్చు పక్క వాళ్ళ సినిమా బాగుండొచ్చు.

ఇదేదో చేస్తే బన్నీ వాసు పడిపోతాడు. ఇక్కడ ఏదో తొక్కితే బన్నీ వాసు పడిపోతాడు అని అనుకుంటున్నారేమో అదంతా నా వెంట్రుక. నా సంస్కారం ఎంతటి అంటే నేను ఇంకో వెంట్రుక కూడా తీసి ఇవ్వగలను. కానీ తల మీద వెంట్రుకే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. నేను ఎప్పటికీ పరిగెడుతూనే ఉంటాను. ఎంతమంది ఏం చేసినా నేను పరిగెడుతూనే ఉంటాను.

మీ గురించి నేనేమీ పెద్దగా ఆలోచించటం లేదు ఎంత ట్రోలింగ్ చేస్తారో చేసుకోండి. అనే ట్రోలింగ్ చేసే వాళ్ళు కూడా చెప్తున్నాను డబ్బులు వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకోండి. మీ పాజిటివ్ ఎనర్జీ ని తీసుకొచ్చి నెగిటివ్ గా పెడుతున్నారు కాబట్టి ఎక్కువ డబ్బులు తీసుకుని చేయండి. పొగడటానికి తక్కువ తీసుకోండి గాని అవతలవాడిని తిట్టడానికి మాత్రం ఎక్కువ తీసుకోవాలి.

Also Read : Bigg Boss 9 : ఫైర్ స్ట్రోమ్ వచ్చింది, హౌస్ లో చిచ్చు పెట్టింది. కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడా?

Related News

Bunny Vas : పోలీసులు ఆశ్రయించిన బన్నీ వాస్ , ముగ్గురును అదుపులోకి తీసుకున్న పోలీసులు

‎NBK 111: గోపీచంద్ – బాలయ్య మూవీ పై బిగ్ అప్డేట్.. చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందంటూ!

Rishab Shetty: హ్యట్సాఫ్ రిషబ్‌ శెట్టి.. క్లైమాక్స్‌ సీన్‌ కోసం ఇంతలా కష్టపడ్డారా?

Raviteja: ఆ హీరో బయోపిక్ ఆలోచనలో రవితేజ..సాధ్యం అయ్యేనా?

‎Pradeep Ranganathan: ఫౌజీ సినిమా పై టంగ్ స్లిప్ అయిన ప్రదీప్ రంగనాథన్..ఇలా చెప్పాడేంటీ?

Salman Khan: అందుకే సికిందర్‌ కంటే మదరాసి బ్లాక్‌బస్టర్‌.. డైరెక్టర్‌ మురుగదాస్‌కి సల్మాన్‌ కౌంటర్‌!

SSMB 29: మార్కెట్లోకి SSMB 29 పెండెంట్స్..ఒక్క పోస్టర్ తో భారీ హైప్.. ఇదెక్కడి క్రేజ్ రా బాబు!

Big Stories

×