KCB 17: బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ హీరోగా వెండి తెరపై ప్రేక్షకులను ఎలా మెప్పించాలో తన మాట తీరుతో బుల్లితెర ప్రేక్షకులను కూడా అదే విధంగా ఆకట్టుకున్నారు ఈయన కౌన్ బనేగా కరోడ్ పతి(KCB) కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఎంతలా విజయవంతమైందో అందరికీ తెలిసిందే. ఇక హిందీలో ఈ కార్యక్రమం ఏకంగా 17వ సీజన్ ప్రసారం అవుతుంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్స్ , అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) అభిమానులు సదరు కంటెస్టెంట్ ప్రతిభ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఓ కుర్రాడు కంటెస్టెంట్ గా బిగ్ బీ ముందు హాట్ సీట్లో కూర్చున్నారు. అయితే ఈ కుర్రాడు మాట తీరు, అత్యుత్సాహం తన పట్ల విమర్శలకు కారణమవుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో ఎలాంటి డబ్బు సంపాదించకుండా ఖాళీ చేతులతో వెళ్లడానికి కూడా కారణమైనదని చెప్పాలి. ఈ కార్యక్రమంలో భాగంగా గుజరాత్ లోని గాంధీ నగర్ కు చెందిన ఐదవ తరగతి విద్యార్థి ఇషిత్ భట్ (Ishith Bhatt)పాల్గొన్నారు.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో భాగంగా ఈ ఆటకు సంబంధించి కొన్ని నియమాలను అమితాబ్ చెబుతున్న సమయంలో ఆయనని చెప్పనివ్వకుండా నాకు ఈ నియమాలన్నీ తెలుసు అంటూ ఇషిత్ అడ్డుపడ్డారు.
ఇషిత్ ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బీ లాంటి ఎంతో అనుభవం ఉన్న ఒక హోస్ట్ తో మాట్లాడుతున్న సమయంలో కాస్త అహంకారం ప్రదర్శించారనే భావన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అలాగే ప్రశ్నలు అమితాబ్ వివరిస్తున్నప్పటికీ ఆ ప్రశ్నలను కూడా వినకుండా సమాధానాలను లాక్ చేయటం ఇషిత్ తొందరపాటు నాకు తెలియజేస్తోంది. ఇక రామాయణం గురించి ప్రశ్న ఎదురవడంతో ఇషిత్ కాస్త నిరుత్సాహానికి గురి అవుతూ అన్ని సమాధానాలను లాక్ చేయండి అంటూ మాట్లాడారు. ఈ సమయంలో ఇషిత్ మాట్లాడే మాట తీరు వింటే కొందరికి సరదాగా మాట్లాడారనే భావన కలిగిన, మరికొందరు మాత్రం అగౌరవంగా మాట్లాడుతున్నారని భావనలో ఉన్నారు.
Very satisfying ending!
Not saying this about the kid, but the parents. If you can't teach your kids humility, patience, and manners, they turn out to be such rude overconfident lot. Not winning a single rupee will surely pinch them for a long time.
pic.twitter.com/LB8VRbqxIC— THE SKIN DOCTOR (@theskindoctor13) October 12, 2025
ఇలా ఇషిత్ వ్యవహార శైలి గురించి అమితాబ్ మాట్లాడుతూ కొన్నిసార్లు పిల్లలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తెలియకుండా తప్పులు చేస్తుంటారని చెబుతుండగానే ఇషిత్ వెంటనే మాట్లాడకండి ప్రశ్న అడగండి అంటూ చెప్పుకు వచ్చారు. ఇలా ఇషిత్ అత్యుత్సాహం అహంకారం అతనికి ప్రైజ్ మనీ రాకుండా చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ వీడియో పై పలువురు కామెంట్ చేస్తూ పిల్లల ఆత్మవిశ్వాసం ప్రశంసనీయమైనది అయినప్పటికీ, ఇషిత్ తల్లిదండ్రులు మాత్రం సహనం గౌరవాన్ని పెంపొందించే విషయంలో పూర్తిగా విఫలమయ్యారు అంటూ ఈ వీడియో పై కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Raviteja: ఆ హీరో బయోపిక్ ఆలోచనలో రవితేజ..సాధ్యం అయ్యేనా?