Bunny Vas : కొద్దిసేపటి క్రితమే బన్నీ వాసు నిర్మించిన మిత్రమండలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో కొన్నిచోట్ల సినిమాకి సంబంధించి అక్టోబర్ 15వ తారీఖున ప్రీమియర్ షోస్ కూడా పడుతున్నాయి.
కొద్దిసేపటి క్రితమే జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ వాసు మాట్లాడిన మాటలు ఇండస్ట్రీ వర్గాలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తన స్పీచ్ మొదలెట్టినప్పుడు నవ్వుతూ అందరి గురించి చెబుతూ మాట్లాడారు బన్నీ వాసు. కానీ ఒక తరుణంలో స్పీచ్ మరో మలుపు తిరిగింది. తన సినిమాను ఎవరో టార్గెట్ చేస్తున్నట్టు బహుశా బన్నీ వాసు దృష్టికి చేరి ఉండవచ్చు. అందుకే ఏకంగా ఎవరి పేర్లు బయటకు తీయకుండా వాళ్ల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు.
బన్నీ వాసు నిర్మించిన మిత్రమండలి సినిమా గురించి కొంతమంది నెగటివ్ కామెంట్స్. నెగిటివ్ ప్రోపగండా కావాలనే స్ప్రెడ్ చేస్తున్నారు అని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కొన్ని ఐపీ అడ్రస్ లు ట్రేస్ చేశారు. అలానే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ప్రశ్నించడం మొదలుపెట్టినట్లు తెలుస్తుంది.
ఇక్కడికి అందరం కష్టపడి ఎదగడానికే వచ్చాం. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, సినిమా బాగోకపోతే ఎవరూ చూడరు. ఏదేమైనా ఫైనల్ గా సినిమా జడ్జిమెంట్ తెలిపేది ప్రేక్షకులు. సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడటం వలన ఒరిగిపోయేదేమీ లేదు.
నన్ను టార్గెట్ చేస్తే అది నాకు వెంట్రుక. నేను పరిగెడుతూనే ఉంటాను పరిగెడుతూనే ఉంటాను. ఒకవేళ ఆగిపోయి నీ గురించి ఆలోచిస్తూ ఉండలేను. నేను పరిగెడుతూ ఉంటేనే నేను నా గమ్యాన్ని చేరుకోగలను అని బన్నీ వాసు తన స్పీచ్లో చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ స్పీచులు వైరల్ గా మారాయి. ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి.