BigTV English

Honor X60 : కిర్రాక్ కెమెరా ఫీచర్స్ తో Honor మెుబైల్ లాంఛ్.. ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువోచ్

Honor X60 : కిర్రాక్ కెమెరా ఫీచర్స్ తో Honor మెుబైల్ లాంఛ్.. ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువోచ్

Honor X60 Series : ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ తో పాటు అద్భుతమైన స్పెసిఫికేషన్స్ తో కొత్త మొబైల్స్ ను లాంఛ్ చేస్తూ వస్తున్న హానర్ కంపెనీ తాజాగా అదిరిపోయే కెమెరా ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. అతి తక్కువ ధరకే యువతను ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్న మొబైల్స్ ను తీసుకొచ్చింది. Honor X60 సిరీస్ లో రెండు మొబైల్స్ లో లాంచ్ చేసిన ఈ కంపెనీ అద్భుతమైన డిస్ ప్లే తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, హై సెక్యూరిటీ స్టాండర్డ్ ఉండే విధంగా మొబైల్స్ ను డిజైన్ చేసింది.


చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హానర్.. తాజాగా Honor X60, Honor X60 Pro మెుబైల్స్ ను చైనాలో రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో కెమెరాతో పాటు స్పెసిఫికేషన్స్ సైతం అత్యద్భుతంగా తీర్చిదిద్దింది. 108 MP Samsung HM6 బ్యాక్ కెమెరాతో పాటు మ్యాజిక్ ఓఎస్ 8.0 ఆండ్రాయిడ్ ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్ పని చేస్తుందని హానర్ కంపెనీ తెలిపింది.

Honor x 60


ఫీచర్స్ – Honor x 60 స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే ను లేటెస్ట్ వెర్షన్ లో డిజైన్ చేశారు. 6.8 అంగుళాల FHD + 120 HZ LED స్క్రీన్ తో 850 బ్రైట్నెస్ తో మొబైల్ లాంఛ్ అయింది. మీడియా టెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా 6nm ప్రాసెసర్‌తో 12GB RAM, 512GB  ఆన్‌బోర్డ్ స్టోరేజీ తో వచ్చేసింది.

కెమెరా – ఈ స్మార్ట్ ఫోన్ లో కెమెరా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. 108 MP Samsung HM 6 బ్యాక్ కెమెరాతో పాటు సెల్ఫీ కెమెరా 8 MP గా ఉంది.

ఫాస్ట్ ఛార్జింగ్  – Honor x 60 స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రాబోతుంది. హానర్ స్టాండర్డ్ వేరియంట్ 35 w ఫాస్ట్ ఛార్జింగ్ 5800 mah బ్యాటరీను సపోర్ట్ చేస్తుంది.

సెక్యూరిటీ – హై స్టాండర్డ్ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను డిజైన్ చేశారు.

ధర – ఈ స్మార్ట్ ఫోన్ 8GB RAM + 128 GB స్టోరేజ్ ధర రూ, 14,500 గా ఉంది. ఇక 12GB + 512 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,222 గా ఉంది. ఎలిగెంట్ బ్లాక్, మూన్‌లైట్, సీ లేక్ క్విన్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

Honor X60 Pro 

Honor X60 Proలో ఉన్న విధంగానే ఈ స్మార్ట్ ఫోన్లో సైతం కెమెరా స్పెసిఫికేషన్స్ తీర్చిదిద్దారు. ఇక 66 w ఫాస్ట్ ఛార్జింగ్ తో పెద్ద బ్యాటరీను కలిగి ఉంది. 6600 ఎంహెచ్ బ్యాటరీని సపోర్ట్ చేస్తుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ 8GB + 128 GB ధర రూ. 17,683 గా ఉండగా.. స్కై బ్లూ, బర్నింగ్ ఆరెంజ్, బ్లాక్ కలర్స్ లో అందుబాటులో ఉండనుందని హానర్ కంపెనీ తెలిపింది. ఇక త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్స్ భారత్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ALSO READ : చంద్రుడిని కబ్జా చేయనున్న చైనా.. ఏకంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు, మెల్ల మెల్లగా భూమిలా మార్చేస్తారట!

 

Related News

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Flipkart Budget Phones: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్.. ₹20,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇవే..

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Big Stories

×