E-Paper
Advertisement

Sitara entertainments: పర్ఫెక్ట్ ప్లానింగ్ నెలకో సినిమా రెడీ, సినిమాలు గ్యాప్ వస్తే డిస్ట్రిబ్యూషన్

Sitara entertainments: పర్ఫెక్ట్ ప్లానింగ్ నెలకో సినిమా రెడీ, సినిమాలు గ్యాప్ వస్తే డిస్ట్రిబ్యూషన్
Advertisement

Sitara entertainments: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో సూర్యదేవర నాగ వంశీ ఒకరు. సూర్య దేవర నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాతగా సినిమాలను నిర్మిస్తున్నారు. మొదట హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో నిర్మితమయ్యే సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేసిన నాగ వంశీ. ఆ తర్వాత ఆ బ్యానర్ కి అనుబంధంగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను నిర్మించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఇప్పటివరకు చాలా మంచి సినిమాలు వచ్చాయి. జెర్సీ లాంటి నేషనల్ అవార్డు ఫిలిం కూడా అదే బ్యానర్ లో వచ్చింది. అయితే కొన్ని విషయాల్లో నాగ వంశీ చాలా అగ్రెసివ్ గా ముందుకు వెళుతూ ఉంటారు. కొన్నిసార్లు ఇది ఆ బ్యానర్ కు ప్లస్ అవుతుంది. ఇంకొన్నిసార్లు ఇదే ఆ బ్యానర్ కి మైనస్ కూడా అవుతుంది.

ఈ బ్యానర్ లో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు అని అంటే డీజే టిల్లు, మ్యాడ్ అనే చిన్న సినిమాలను చెప్పొచ్చు. ఈ సినిమాలు చిన్న సినిమాలుగా వచ్చినా కూడా పెద్ద ఇంపాక్ట్ ను క్రియేట్ చేసి కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించాయి. మంచి కలెక్షన్లను కూడా కురిపించాయి. అయితే మ్యాడ్ విషయానికొస్తే రిలీజ్ కంటే ముందు రోజే ప్రీమియర్ షోస్ వేసి సినిమా పైన హైపు ను పెంచాడు నాగ వంశీ. అలానే ఆదికేశవ అనే సినిమాకి కూడా ప్రీమియర్స్ వేశాడు. కానీ ఆ సినిమా ఫలితం తేడా కొట్టడంతో ఆ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఇకపోతే సితార ఎంటర్టైన్మెంట్స్ లో గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా లేట్ అవుతున్న తరుణంలో మ్యాజిక్ అని మరో సినిమాని గౌతమ్ తిన్నానూరితో రెడీ చేయించాడు నాగ వంశీ.

Advertisement

అనిరుద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్ట్ కూడా రిలీజ్ చేశారు. దాదాపు అందరూ మర్చిపోయిన తరుణంలో ఈ సినిమా ఒకటి ఉంది అని అందరికీ ఒక గుర్తు చేశారు. ఒక ప్రొడక్షన్ హౌస్ లో ఒక సినిమా తెరకెక్కడానికి దాదాపు నెలలు తరబడి, కొన్ని సినిమాలకైతే సంవత్సరాల తరబడి కూడా పడిగాపులు కాస్తుంటారు కొందరు దర్శకులు. కానీ సితార ఎంటర్టైన్మెంట్స్ లో మాత్రం ఒక సినిమా డిలే అవుతున్న తరుణంలో మరో సినిమాని లైన్లో పెట్టి ఆ సినిమాతో దర్శకుణ్ణి పరిచయం చేయటం అనేది గర్వించదగ్గ విషయం. ఇక ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి నెలకు ఒక సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అక్టోబర్ 31 న హ్యాపీ భాస్కర్, నవంబర్ – మ్యాడ్ స్క్వేర్, డిసెంబర్ 21న మ్యాజిక్, జనవరి 12న #NBK109 సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు మంచి బజ్ ఉన్న సినిమాలను డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంటారు నాగ వంశీ.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×