BigTV English

Honor X9c: హానర్ X9c 5G ఇండియాలో లాంచ్.. 108 మెగాపిక్సెల్ కెమెరాతో స్పెషల్ ఫీచర్

Honor X9c: హానర్ X9c 5G ఇండియాలో లాంచ్.. 108 మెగాపిక్సెల్ కెమెరాతో స్పెషల్ ఫీచర్

Honor X9c| హానర్ సంస్థ భారత్‌లో ఒక సంవత్సరం విరామం తర్వాత కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. హానర్ X9c 5G అనే ఈ కొత్త ఫోన్, గత సంవత్సరం ఫిబ్రవరిలో విడుదలైన X9b మోడల్‌కు కొనసాగింపుగా వచ్చింది. ఈ కొత్త మోడల్ లో 6,600mAh సామర్థ్యం గల పవర్ ఫుల్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్, 8GB ర్యామ్ ఉన్నాయి. ఇది SGS డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో పాటు IP65M రేటింగ్‌ను కలిగి ఉంది. అంటే దుమ్ము, 360-డిగ్రీల వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.


హానర్ X9c ధర, లభ్యత వివరాలు..
భారత్‌లో హానర్ X9c 5G ధర 8GB + 256GB వేరియంట్‌కు రూ. 21,999గా నిర్ణయించబడింది. ఇది జేడ్ సియాన్ టైటానియం బ్లాక్ అనే రెండు అందమైన రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 12 నుండి అమెజాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. SBI లేదా ICICI బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ. 750 తక్షణ తగ్గింపు లభిస్తుంది.

హానర్ X9c ఫీచర్లు
హానర్ X9c 5Gలో 6.78-అంగుళాల 1.5K (1,224×2,700 పిక్సెల్స్) కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్ ప్లే.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్‌గా పనిచేస్తుంది. ఇందులో 3,840Hz PWM డిమ్మింగ్ రేట్, TÜV రీన్‌ల్యాండ్ ఫ్లికర్-ఫ్రీ, తక్కువ బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉన్నాయి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్, 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత మ్యాజిక్‌ఓఎస్ 9.0తో రన్ అవుతుంది. AI మోషన్ సెన్సింగ్, AI ఎరేజ్, AI డీప్‌ఫేక్ డిటెక్షన్, AI మ్యాజిక్ పోర్టల్ 2.0, AI మ్యాజిక్ క్యాప్సూల్ వంటి AI ఫీచర్లను కలిగి ఉంది.


కెమెరా విషయంలో.. ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ (f/1.7 అపెర్చర్, 3x లాస్‌లెస్ జూమ్) మరియు 5-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. మెయిన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

Also Read: మీ వద్ద పాత ఐఫోన్‌లు ఉన్నాయా? ఈ మోడల్స్‌కు కోట్లలో రిసేల్ విలువ!

ఈ ఫోన్‌లో 6,600mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఇది 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G, వై-ఫై, GPS, NFC, OTG, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. దీనికి SGS డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. -30 నుండి 55 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలలో సురక్షితంగా పనిచేస్తుంది. ఇది IP65M రేటింగ్‌తో దుమ్ము, వాటర్ ప్రొటెక్షణ్ ఫీచర్ కలిగి ఉంది. ఈ ఫోన్ 7.98mm మందంతో సన్నగా ఉండడంతో కేవలం 189 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది.

Related News

Vivo V50: మిడ్ రేంజ్ సూపర్ ఫోన్‌ ఇప్పుడు అతి తక్కువ ధరకు.. వివో V50పై భారీ తగ్గింపు!

Amazon Festival Sale: గాడ్జెట్‌లపై 80% వరకు డిస్కౌంట్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ త్వరలో

Oppo A6 Max vs K13: రెండు ఒప్పో కొత్త ఫోన్లు.. మిడ్ రేంజ్ లో ఏది బెటర్?

OnePlus Pad 3: ఇండియాలో పవర్‌ఫుల్ టాబ్లెట్.. అడ్వాన్స్ ప్రాసెసర్‌తో వన్ ప్లస్ ప్యాడ్ 3 లాంచ్

Brain SuperComputer: మనిషి మెదడు లాంటి సూపర్ కంప్యూటర్.. చైనా అద్భుత సృష్టి

Call Transcribe Pixel: పాత పిక్సెల్ ఫోన్‌లలో కొత్త ఫీచర్.. కాల్ ట్రాన్స్‌క్రైబ్.. ఎలా చేయాలంటే?

Big Stories

×