OTT Movie : కొరియన్ డ్రామాలను అందరూ క్రేజీగా చూస్తున్నారు. 2025లో కూడా సరికొత్త కంటెంట్ తో వస్తున్నాయి. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో
ఐయండిబిలో టాప్ రేటింగ్ తో ట్రెండింగ్ అవుతున్న ఈ సిరీస్ లను చూస్తే జీవితంలో మరచిపోలేరు. ఈ స్టోరీలు ఒక్కోటి, ఒక్కో స్టైల్ లో ఉంటాయి. అయితే అవి అన్నీ తోపు సిరీస్ లే. ఈ కొరియెన్ డ్రామాలు రొమాన్స్, కామెడీ, హిస్టారికల్ మిక్స్‌తో హార్ట్‌ను టచ్ చేస్తాయి. ఈ టాప్ రేటెడ్ సిరీస్ ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ కథ 1988 సియోల్‌లో సంగ్-డీ అనే అమ్మాయి, ఆమె 5 మంది ఫ్రెండ్స్ ఒక గ్రామంలో జీవితం గడుపుతారు. కథ ఫ్లాష్ బ్యాక్‌లలో వస్తుంది. వాళ్ల చిన్నప్పటి ఫ్రెండ్‌షిప్, ఫస్ట్ లవ్, ఫ్యామిలీ డ్రామా, 1988 ఒలింపిక్స్ బ్యాక్‌గ్రౌండ్ తో ఈ సిరీస్ ఆశక్తికరంగా సాగుతుంది. ఈ ఫ్రెండ్స్ మధ్య ట్రయాంగిల్ ప్రేమ కథలు స్టోరీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఈ సిరీస్ 2015-2016 మధ్యలో 20 ఎపిసోడ్స్ తో Netflix లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఐయండిబిలో 9.1/10 రేటింగ్ పొందింది.
1950 కాలం నాటి జెసాన్ లో ఓ యూన్ అనే అమ్మాయి ఒక గ్రామంలో పెరుగుతుంది. ఆమె చిన్నప్పటి నుండి అబ్బా అనే అబ్బాయితో ప్రేమలో పడుతుంది. చిన్న చిన్న మూమెంట్స్ తో వాళ్ల లవ్ డెవలప్ అవుతుంది. యుద్ధం, పేదరికం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ల ప్రేమకి అడ్డంకులు వస్తాయి. ఓ యూన్ తన డ్రీమ్స్ కోసం పోరాడుతుంది. అబ్బా ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఈ సిరీస్ 2025 march 7 నుంచి 16 ఎపిసోడ్స్ తో Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ ఫ్యాన్స్‌కు ఇది మస్ట్ వాచ్ సిరీస్. 9.2 /10 ఐయండిబి రేటింగ్ తో టాప్ ట్రెండింగ్ లో ఉంది.
1870 కాలం నాటి జోసాన్ యుగంలో చోయ్ అనే యువకుడు, తన గ్రామం నుండి పారిపోతాడు. 30 ఏళ్ల తర్వాత మిలిటరీ ఆఫీసర్ గా తిరిగి వస్తాడు. అతను అయెన్ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమె ఒక యాక్టివిస్ట్, కొరియా ఇండిపెండెన్స్ కోసం పోరాడుతుంటుంది. జపాన్ ఆక్రమణలో కొరియా తిరుగుబాట్లు చేస్తుంటుంది. ఉజిన్, అయెన్ మధ్య రొమాన్స్, యుద్ధం సన్నివేశాలు . ఈ సిరీస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. 2018లో 24 ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ సిరీస్ Netflix లో 8.7/10 రేటింగ్ తో నడుస్తోంది.
ఈ కొరియెన్ డ్రామాల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది. దీనికి అంతర్జాతీయంగా విస్తృత గుర్తింపు లభించింది. హ్యూన్ బిన్, సన్ యే జిన్ నటించిన ఈ ప్రేమకథ, దక్షిణ కొరియా అమ్మాయి, ఉత్తర కొరియా సైనికుడితో ప్రేమతో మొదలవుతుంది. 2019లో విడుదలైన క్రాష్ ల్యాండింగ్, IMDbలో 8.7 రేటింగ్‌ను కలిగి ఉంది.
Read Also : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ