ఈ రోజుల్లో అవసరాలకు వాడుకుని వదిలేసే మనుషులు ఎక్కువయ్యారు. కొంత మంది డబ్బు పరంగా అలా చేస్తే, మరికొంత మంది రిలేషన్స్ విషయంలోనూ అలాగే ఉన్నారు. ఎవరినీ నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థంకాని పరిస్థితి నెలకొంది. భార్యలను మోసం చేసే భర్తలు, భర్తలను మోసం చేసే భార్యలు, అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు, అబ్బాయిలను మోసం చేసే అమ్మాయిలు అడుగడుగునా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డేటింగ్ యాప్ అయిన గ్లీడెన్ దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోసాలు, అక్రమ సంబంధాలు, విడాకుల వ్యవహారాలకు సంబంధించి ఊహించని అంశాలు బయటకు వచ్చాయి. వివాహం, అవిశ్వాసం, సాంస్కృతిక నిబంధనల పట్ల దేశంలో మారుతున్న వైఖరులను అర్థం చేసుకోవడానికి ఈ యాప్ ఇటీవలి కాలంలో అనేక అధ్యయనాలను నిర్వహించింది.
గ్లీడెన్ యాప్ ఇన్ఫిడెలిటీ స్టడీ 2025లో భాగంగా 12 నగరాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల 1,510 మందిని సర్వే చేసింది. ఈ సర్వేలో బెంగళూరులో 29 శాతం మంది సోషల్ మీడియాలో సరసాలాడుతున్నట్లు అంగీకరించగా, 53 శాతం మంది ఏదో ఒక రకమైన మోసం గురించి ప్రస్తావించారు. 7 శాతం మంది శారీరకంగా, 12 శాతం మంది భావోద్వేగంగా, 34 శాతం మంది రెండు రకాలుగా కనెక్ట్ అయినట్లు తేలింది. గ్లీడెన్ సర్వేలో అక్రమ సంబంధాల గురించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో దాదాపు 55 శాతం మంది వివాహిత మహిళలు ఒక్కసారైన తమ జీవిత భాగస్వామికి నమ్మక ద్రోహం చేసినట్లు తేలింది. దాదాపు 60 శాతం మంది స్వింగింగ్ లాంటి సాంప్రదాయేతర డేటింగ్ పద్దతులను కలిగి ఉన్నట్లు గుర్తించింది. ఈ లక్షణాలు ఎక్కువగా టైర్ 1, టైర్ 2 నగరాల్లోనే ఉన్నాయని తెలిపింది. తాజా ఫలితాల ప్రకారం దేశంలోని ఓ నగరాన్ని అత్యతం అవిశ్వాస నగరంగా తేల్చింది. ఈ సిటీలోని ప్రజల్లో ఎక్కువ మంది మోసకారులే ఉన్నట్లు తెలిపింది. ఇంతకీ ఆ నగరం ఏదో కాదు బెంగళూరు. దేశ అవిశ్వాస రాజధాని టైటిల్ ను గ్లీడెన్ బెంగళూరుకు కట్టబెట్టింది.
వివాహేతర సంబంధాల గురించి గ్లీడెన్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి అయ్యాయి. గ్లీడెన్ సైట్ లో దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగదారులు ఈ నగరం నుంచే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే, ఆ సైట్ లోని మొత్తం యాక్టివ్ యూజర్లలో దాదాపు 27 శాతం మందిబెంగళూరుకు చెందిన వారే. ఈ వినియోగదారులు రోజుకు సగటున 1.5 గంటలు చాట్ లో గడుపుతారని వెల్లడించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య లంచ్ టైమ్ లో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి మధ్య వారి భాగస్వాములు ఎక్కువగా నిద్రపోతున్నప్పుడు యాక్టివ్ గా ఉంటున్నట్లు సర్వేలో వెల్లడించింది.
ఇక పురుష వినియోగదారులు 24, 30 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలను వెతుకుతున్నారని.. వారితో రిలేషన్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపింది. మహిళా వినియోగదారులు 31- 40 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులను ఇష్టపడతారని తేలింది. ఎక్కువగా వర్చువల్ ఎక్స్ఛేంజీలను పంచుకుంటున్నట్లు తేలింది. ఎక్కువ పని ఒత్తిడి, తరచుగా బిజినెస్ ట్రిప్స్ లు, ఇతర నగరాల కంటే బెంగళూరు వాసులలో టెక్నాలజీ పరంగా ఎక్కువ అవగాహన ఉండటం వల్ల అక్రమ సంబంధాలకు కారణం అవుతున్నట్లు తేలింది. గ్లీడెన్ అక్రమ సంబంధాల లిస్టులో బెంగళూరు తర్వాత ముంబై రెండో స్థానంలో నిలిచింది. కోల్ కతా, న్యూఢిల్లీ, పూణే వరుసగా మూడు,నాలుగు, ఐదో స్థానంలో నిలిచాయి. తెలుగు రాష్ట్రాల గురించి ఇందులో పెద్దగా ప్రస్తావించలేదు.
Read Also: బ్యాండ్ మేళాతో పిల్లల్ని నిద్రలేపిన తల్లి.. బద్దకానికి భలే ట్రీట్మెంట్!