Whatsapp Voice Note Transcription : ప్రపంచంలోనే అత్యధిక యూజర్స్ ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్. మెటా ఆధ్వర్యంలో నడిచే ఈ యాప్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ను సంతరించుకుంటుంది. యూజర్స్ తేలికగా ఉపయోగించే విధంగా ఇప్పటికే ఎన్నో అప్డేట్స్ వచ్చినప్పటికీ తాజాగా వచ్చిన మరో లేటెస్ట్ ఫీచర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఫీచర్ ఉంటే మెసేజ్ ను టైప్ చేసి పంపిస్తే చాలు. ఎదుటివాళ్లకి చదివి వినిపించేస్తుంది. ఇక చదువుకోలేని వాళ్లతో పాటు కళ్లకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి సైతం ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ప్రేమికులు సైతం తమకు ప్రియమైన వారి నుంచి వచ్చిన మెసేజెస్ ను ఎంచక్కా వినేయ్యెుచ్చు. ఇక ఈ ఫీచర్ ను ఎలా ఎనేబుల్ చేయాలో ఓసారి చూసెద్దాం.
అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్స్ లో ఒకటైన వాట్సప్.. తాజాగా మరో లేటెస్ట్ అప్డేట్ను తీసుకొచ్చింది. అదే వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్షన్. ఈ ఫీచర్ వాట్సాప్ లో ఉంటే ఎదుటివారు పంపించిన సందేశాలను తేలికగా వినవచ్చు. ఇక సందేశంలో అంతరాన్ని సైతం త్వరగా అర్థం చేసుకోవడం, రిప్లై ఇవ్వడం కూడా చాలా తేలికవుతుంది. ఇక ఈ ఫీచర్ ను మీ వాట్సాప్ లో అప్డేట్ చేయడానికి ఏం చేయాలంటే…
⦿ మొబైల్ లో వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయాలి.
⦿ లేటెస్ట్ వెర్షన్ ఇన్ స్టాల్ అయిందో లేదో చెక్ చేయాలి
⦿ గూగుల్ ప్లే స్టోర్లో వాట్సాప్ ను అప్డేట్ చేయాలి.
⦿ ఇక వాట్సప్ లో కుడి వైపున పైన ఉన్న మూడు డాట్స్ ను క్లిక్ చేసి వాట్సాప్ సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలి
⦿ ఈ సెట్టింగ్స్ లో చాట్ సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలి
⦿ ఇక్కడ వాయిస్ నోట్లో ట్రాన్స్కిప్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది
⦿ ఈ ఆఫ్షన్ ను ఆన్ చేస్తే ఎనేబుల్ అవుతుంది
⦿ ఇప్పటినుంచి మీకు వచ్చిన మెసేజ్లను ఎంచక్కా వినవచ్చు
ఇక ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం ఎంతగా పెరిగిందో వాట్సాప్ వినియోగం కూడా అంతే పెరిగిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ యాప్ యువతను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రతీ ఒక్కరికి సందేశాలు పంపించడానికి ముఖ్య సాధనంగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా వాట్సాప్ ను వినియోగించే వారి సంఖ్య పెరగటంతో వాట్సాప్ మాతృ సంస్థ మెటా సైతం ఎప్పటికప్పుడు యూజర్స్ డిమాండ్కు అనుగుణంగా సరికొత్త ఫీచర్స్ ను తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఎన్నో లేటెస్ట్ ఫీచర్స్ తీసుకొచ్చిన మెటా.. తాజాగా మెసేజ్ డ్రాఫ్ట్, వాట్సాప్ గ్రూప్ చాట్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. వాట్సాప్ డ్రాఫ్ట్ తో యాజర్స్ సందేశాన్ని పంపాల్సి వచ్చి మర్చిపోయినా ఆటోమేటిక్గా గుర్తు చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక వాట్సాప్ గ్రూప్ చాట్ తో గ్రూప్ చాట్‌లోనే.. కొత్త గ్రూప్‌లకు సంబంధించిన పార్టిసిపెంట్స్‌ను చేర్చుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఈ ఫీచర్స్ సైతం యూజర్స్ కు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
ALSO READ : స్పామ్ కాల్ ఖరీదు రూ.11 లక్షలు.. !!