BigTV English

Rashmi Gautam : మెహందీ పెట్టుకున్న రష్మీ.. బ్లాస్టింగ్ న్యూస్ అంటూ పోస్ట్..

Rashmi Gautam : మెహందీ పెట్టుకున్న రష్మీ.. బ్లాస్టింగ్ న్యూస్ అంటూ పోస్ట్..

Rashmi Gautam : ఈ మధ్య కాలంలో యాక్టర్స్, యాంకర్స్ తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఒక్కొక్కరు పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. కొంధరేమో తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే, మరికొందరు తమ కుటుంబ సభ్యులు చూసిన అబ్బాయిని లేదా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. గత రెండు నెలలుగా చాలామంది పెళ్లి పీటలు ఎక్కారని తెలిసిందే. ఇక రీసెంట్ గా త్వరలో పెళ్లి చేసుకోబోతుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు మరో యాంకర్ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పేసింది అని వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు యాంకర్ రష్మీ గౌతమ్.. తాజాగా యాంకర్ రష్మీ పోస్ట్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఆ ఫోటో ఎందుకు పోస్ట్ చేసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


యాంకర్ రష్మీ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై నిత్యం ఏదో ఒక షోలో సందడి చేస్తూ కనిపిస్తుంది. ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇన్నేళ్లు వచ్చినా యాంకర్ రష్మీ ఇంకా పెళ్లి చేసుకోలేదని వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అంతేకాదు గతంలో చాలా సార్లు ఈమె సుదీర్ ని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపించాయి. కానీ మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలు సద్దుమణిగాయి. ఇటు సుధీర్, రష్మీ ఇద్దరు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. అయితే వీరిద్దరూ కలిసి ఏ షోకు వెళ్లినా అక్కడ ఇద్దరి పై సెటైర్లు వినిపిస్తూనే ఉంటాయి. రీసెంట్ గా సుధీర్ ఓ ఈవెంట్ కు వెళితే ఇంకా పెళ్లి చేసుకోలేదు ఏంటి అని అందరూ అడిగారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రష్మీ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో రష్మీ మెహందీ పెట్టుకుని కనిపిస్తుంది.

మెహంది పెట్టుకుంటూ చిరు నవ్వులు చిందిస్తున్న రష్మి .. ఓ కన్ను కొడుతూ టైమ్ టూ ఫోటో బాంబ్, మై ఫీడ్ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అసలేం జరుగుతోంది, సుధీర్‌తో మ్యారేజ్ ఎప్పుడు రష్మి ప్రశ్నలు వేస్తున్నారు. కామెంట్లతో ఫోటోలు వైరల్ అవుతుండడంతో ఆమె ఫ్యాన్స్ పెళ్లికి రెడీ అవుతున్నావా అని అడుగుతున్నారు.. మరి దీనిపై యాంకర్ రష్మీ ఏమని సమాధానం చెబుతుందో చూడాలి..


 

View this post on Instagram

 

యాంకర్ రష్మీ కెరియర్ విషయానికొస్తే.. హోలీ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. సినీ ఇండస్ట్రీలో అంతగా పేరు రాలేదని బుల్లితెరపై కాలు పెట్టింది. ఇక్కడ జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. బుల్లితెరపై ఎటువంటి షోలు వచ్చినా రష్మీ తన యాంకరింగ్ తో అదరగొడుతుంది. ఇక సోషల్ మీడియాలో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×