Email Scams : స్కామ్స్.. సైబర్ క్రైమ్స్.. ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరిని హడాలెత్తిస్తున్న మాటలు. నిజానికి వీటికి ఏ ఒక్కరూ అతీతులు కాదు. ఎంతో చదువుకున్న విద్యావంతులతో పాటు ఏమాత్రం చదువు రాని వాళ్ళని సైతం స్కామర్స్ ఎంతో తెలివిగా బుట్టలో వేసుకుంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల ఈ స్కామ్స్ జరుగుతుండటంతో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ ఇలాంటి నేరాలు ప్రతీచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఉద్యోగం పేరిట ఓ వ్యక్తికి వచ్చిన ఈ మెయిల్ అతన్ని నిలువునా ముంచేసింది. సైబర్ నేరగాళ్లను నమ్మిన ఆ వ్యక్తి రూ.11 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆన్లైన్ జాబ్.. ఈ విషయాన్ని నమ్మి ప్రతీ ఒక్కరూ మోసపోతున్నారు. ఎక్కడికక్కడ నిరుద్యోగులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. ఈమెయిల్ పంపించి జాబ్స్ ఇస్తామంటూ నమ్మించి మోసం చేస్తున్నారు. ఈ సంఘటన మరోసారి ప్రతీ ఒక్కరిని ఆలోచించేలా చేసింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో కారోవాల్ నగర్ కు చెందిన ఓ వ్యక్తికి కొన్ని రోజుల క్రితం ఒక ఈమెయిల్ వచ్చింది. నిజానికి ఈమెయిల్ మే 2024లో వచ్చింది. రిక్రూట్మెంట్ సర్వీస్ నుంచి మెయిల్ పంపించినట్టు ఉన్న అందులో అర్జెంటుగా జాబ్ రిక్వైర్మెంట్ ఉందని యూనివర్సిటీ నుంచి ఈ మెయిల్ పంపిస్తున్నట్టు స్కామర్స్ తెలిపారు. ఈ క్వాలిఫికేషన్స్ మీకు ఉన్నందున ఈ జాబ్ ఇస్తున్నామంటూ నమ్మించారు. నమ్మిన వ్యక్తి తన పర్సనల్ డాక్యుమెంట్స్ తో పాటు ఈమెయిల్ అడ్రస్ కూడా పంపించాడు. ఇక కొద్ది రోజుల్లోనే సెలెక్ట్ అయినట్టు వారి నుంచి మరొక మెయిల్ వచ్చింది. మిగిలిన విషయాలు త్వరలోనే మాట్లాడతామంటూ.. ఇందుకు తగిన ప్రాసెస్ ని పూర్తి చేయడానికి వారు డబ్బులు డిమాండ్ చేశారు.
స్కామర్స్ మాటలు నమ్మిన ఆ వ్యక్తి జాబ్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్, వీసా, విదేశాల్లో ఉండటానికి కావలసిన ఖర్చులు అన్నిటికీ వారు అడిగిన విధంగా డబ్బులు పంపించాడు, అలాగే వాళ్ళు అతన్ని నమ్మిస్తూ పలు దఫాలుగా రూ.11 లక్షల వరకు తీసుకున్నారు. యూనివర్సిటీ హెచ్ ఆర్ డిపార్ట్మెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందని, మెడికల్ చెక్ అప్ ఉంటాయని కూడా స్మామర్స్ చెప్పుకొచ్చారు. ఇక డబ్బులు పంపించి నెలలు గడుస్తున్నప్పటికీ స్కామర్స్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తను మోసపోయానని గ్రహించి వెంటనే నార్త్ ఈస్ట్ ఢిల్లీలో సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేశాడు సదరు వ్యక్తి. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అప్రమత్తత అవసరం –
ఇక కొన్నాళ్ళుగా ఎక్కడకక్కడ సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నప్పటికీ జనాలు మోసపోతున్నాయి. ప్రతీ ఒక్కరూ ఈ సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ఉండటానికి తగిన సమాచారం తెలుసుకోవాలి.
మెయిల్స్ కు స్పందించొద్దు – సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఈమెయిల్స్ ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే జాబ్ ఆఫర్స్ పేరుతో వచ్చే ఈమెయిల్స్, అర్జెంటు రిక్రూట్మెంట్ అఫీషియల్ రిక్రూట్మెంట్ అంటూ వచ్చే మెయిల్స్ కు అసలు స్పందించకపోవడమే మేలు.
వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు – ఎటువంటి పరిస్థితుల్లో స్కామర్స్ ను నమ్మి వ్యక్తిగత సమాచారం, డాక్యుమెంట్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఈమెయిల్ అడ్రస్ లాంటివి ఇవ్వకూడదు
డబ్బులు డిమాండ్ చేస్తే అనుమానించాల్సిందే – ఈ స్కామర్స్ డబ్బులే లక్ష్యంగా దాడులకు దిగుతారు. అందుకే ఆన్లైన్ మనీ పేమెంట్స్, బ్యాంక్ డీటెయిల్స్ వంటి వాటిని అసలు షేర్ చేయకూడదు. ఏమైనా డబ్బులు పంపించమని రిక్రూట్మెంట్ ఏజెన్సీలని చెబితే కచ్చితంగా అనుమానించాల్సిందే.
అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయాలి – జాబ్ ఇస్తామంటూ వచ్చే కంపెనీ లేదా యూనివర్సిటీకు సంబంధించిన అఫీషియల్ వెబ్ సైట్ ను చెక్ చేయడం మంచిది. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఉద్యోగానికి ముందడుగు వేయాలి.
రిపోర్ట్ సస్పిసియన్స్ ఈమెయిల్స్ – తప్పుడు మెయిల్స్ వచ్చిన వాటిని కచ్చితంగా రిపోర్ట్ చేయాలి
ALSO READ : బడ్జెట్లో బెస్ట్ ఫోన్ లాంఛ్ చేసిన వివో.. పిచ్చెక్కిస్తున్న ప్రీ బుకింగ్ ఆఫర్స్