BigTV English

HTC New Smartphone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ప్రముఖ సంస్థ రీఎంట్రీ.. ధర & స్పెసిఫికేషన్స్

HTC New Smartphone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ప్రముఖ సంస్థ రీఎంట్రీ.. ధర & స్పెసిఫికేషన్స్

HTC Company Launching HTC U24 Series Smartphone: తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హెచ్‌టీసీ (HTC భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఈ కంపెనీ బుధవారం (మే 15) సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. అయితే అందుకు సంబంధించి ఫోన్ వివరాలు కానీ, లాంచ్ డేట్ కానీ ఎక్కడా వెల్లడించలేదు.


అందుతున్న సమాచారం ప్రకారం.. HTC U24 సిరీస్ మోడల్ కావచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది గత సంవత్సరం HTC U23, HTC U23 ప్రో అప్‌గ్రేడ్‌లతో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఇప్పుడు HTC U24, HTC U24 Proగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ గత మోడళ్ల కంటే అప్‌గ్రేడ్‌తో రానున్నట్లు సమాచారం. మోడల్ నంబర్ 2QDA100తో ఉన్న ఈ హ్యాండ్‌సెట్‌లలో ఒకటి ఇటీవల గీక్‌బెంచ్, బ్లూటూత్ SIG వెబ్‌సైట్‌లలో కనుక్కోబడింది.

ఇక రాబోయే ఫోన్‌లో Qualcomm స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 SoC ఫీచర్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది 12GB RAMతో వస్తున్నట్లు సమాచారం. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో సహా స్పెసిఫికేషన్‌లను మరిన్ని స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త మోడల్‌లు పూర్తి 120Hz రిఫ్రెష్ రేట్‌తో HD+ OLED డిస్‌ప్లేలను కలిగి ఉండే ఛాన్స్ ఉంది.


Also Read: 16GB ర్యామ్ – 1TB స్టోరేజ్.. 200MP కెమెరాతో Vivo నుంచి కొత్త ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే?

HTC U24 అండ్ HTC U24 Proగా రాబోతున్న ఈ ఫోన్లు IP67 సర్టిఫైడ్ బిల్డ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతో Android 14 ఆధారత ఓఎస్‌ను కలిగి ఉన్నట్లు సమాచారం. అయితే గతంలో మార్కెట్‌లో పలు మోడళ్లను తీసుకొచ్చిన హెచ్‌టీసీ కంపెనీ ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల తమ ఉత్పత్తులను నిలిపివేసింది. ఇక ఇప్పుడు మళ్లీ మార్కెట్‌లోకి రీఎంట్రీ ఇస్తుంది. మరి ఇప్పుడు అయినా తన జోరు కనబరుస్తుందా? లేదా అనేది చూడాలి.

ఇకపోతే గత ఏడాది రిలీజ్ అయిన HTC U23 ప్రో మొబైల్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వచ్చింది. అలాగే 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేటును కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ఎస్‌ఓసీతో వచ్చింది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుకవైపు నాలుగు కెమెరాలను అందించారు. ఓఐఎస్‌తో 108 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సా, 5మెగా పిక్సెల్ మాక్రో కెమెరాను అందించారు. అదే ఫోన్ ముందు భాగంలో 32 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. 4600 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది.

Tags

Related News

Jio Network: జియో, వి నెట్‌వర్క్‌లో అంతరాయం.. అసలు ఏమైంది?

Cooking Oil: ఏంటీ.. వాడేసిన వంట నూనెతో విమానాలు నడిపేస్తారా.. ఎక్కడో కాదు ఇండియాలోనే!

Chinese Robot: పిల్లలను కనే రోబోలు వచ్చేస్తున్నాయ్.. జస్ట్ ఇలా చేస్తే చాలు, పండంటి బిడ్డ మీ చేతిలో!

Infinix Hot 60i vs Tecno Spark Go: ₹10,000 లోపు ధరలో కొత్త 5G ఫోన్లు.. ఏది బెటర్?

Galaxy S24 Ultra Alternatives: గెలాక్సీ S24 అల్ట్రాకు పోటీనిచ్చే ప్రీమియం ఫోన్లు.. తక్కువ ధర, అద్భుత ఫీచర్లతో శాంసంగ్‌కు చెక్

Vivo G3 5G Launch: వివో G3 5G విడుదల.. ₹20,000 లోపు ధరలో 6000mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లే

Big Stories

×