Galaxy S25 Ultra Discount| శాంసంగ్ తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రాకు అమెజాన్‌లో భారీ ధర తగ్గింపు అనుమతించబడింది. ఈ టాప్-టైర్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ సొంతం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది ఒక బ్లాక్‌బస్టర్ డీల్. ఈ ఫోన్ రూ. 1,29,999 ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం.. అన్ని డిస్కౌంట్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్ల తరువాత మీరు ఈ ఫోన్‌ను రూ. 72,000 కంటే తక్కువకు కొనుగోలు చేయవచ్చు. అంటే దాదాపు రూ. 58,900 సేవింగ్స్ చేయవచ్చు.
గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 99,150కు లిస్ట్ చేయబడింది. ఇది దాని అసలు ధర కంటే డైరెక్ట్ రూ. 30,849 డిస్కౌంట్ సూచిస్తుంది. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అమెజాన్ పే ఐసిఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించే కస్టమర్లు అదనంగా రూ. 2,974 తగ్గింపును పొందవచ్చు. ఇది ఎఫెక్టివ్ ధరను రూ. 96,176 కు తగ్గిస్తుంది.
అమెజాన్ ట్రేడ్-ఇన్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆప్షన్‌లో అదనపు సేవింగ్స్ కోసం కస్టమర్లు వారి పాత ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేయడానికి అనుమతిస్తుంది. పాత ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి దాని మారక విలువ నిర్ణయిస్తారు. వినియోగదారులు రూ. 52,600 వరకు ఎక్స్‌చేంజ్ విలువను పొందవచ్చు. ఉదాహరణకు, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఉపయోగించి ఎక్స్‌చేంజ్ ఆఫర్‌ను చెక్ చేసినప్పుడు, అమెజాన్ రూ. 25,150 ను ఆఫర్ చేసింది. ఇది ఎస్ 25 అల్ట్రా ఫైనల్ ధరను రూ. 71,026 కు తగ్గిస్తుంది. అంటే మొత్తం రూ. 58,973 డిస్కౌంట్‌కు సమానం.
ఈ ఫోన్ క్వాడ్-కెమెరా సెటప్, రిఫైన్డ్ డిజైన్, బిల్ట్-ఇన్ ఎస్ పెన్ సపోర్ట్, అతి ప్రకాశవంతమైన డిస్ప్లే వంటి కట్టింగ్-ఎడ్జ్ ఫీచర్ల ప్రీమియం వంటి సూపర్ ఫీచర్స్ అందిస్తుంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో లభించే ఆండ్రాయిడ్ ఫోన్లలో సూపర్ ఫోన్‌గా పరిగణించబడుతుంది. ఫోటోగ్రఫీ, గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి అన్ని అససరాలను ఇది సులభంగా నిర్వహించగలదు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ధరలో ఉన్న ఈ అతిపెద్ద తగ్గింపు, ఈ లెవెల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కొనాలనుకునే వారికి ఇది ఒక అరుదైన అవకాశం. ప్రత్యక్ష డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లు, బెస్ట్ వ్యాల్యూ ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో ఈ డీల్‌ను చాలా ఆకర్షణీయంగా చేస్తుంది. మీరు ఒక పవర్‌ఫుల్, ఫీచర్-ప్యాక్డ్ ఫోన్ కోసం మార్కెట్ చూస్తుంటే, ఈ డీల్ ఇప్పుడు సరైన సమయం అని చెప్పవచ్చు.
Also Read: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఐఫోన్ మోడల్ ఇదే