BigTV English

Jathi Rathnalu 2: జాతి రత్నాలు 2 అస్సలు చెయ్యను.. ఇదేం ట్విస్ట్ ప్రియదర్శి?

Jathi Rathnalu 2: జాతి రత్నాలు 2 అస్సలు చెయ్యను.. ఇదేం ట్విస్ట్ ప్రియదర్శి?

Jathi Rathnalu 2: సినీ నటుడు ప్రియదర్శి(Priyadarshi) ఇటీవల కాలంలో ఎంతో విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకుంటూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంటారు. ఇటీవల కోర్టు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రియదర్శి త్వరలోనే మిత్రమండలి (Mithra Mandali)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 16వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నేడు సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది.


జాతి రత్నాలు 2 ..

ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ చూస్తుంటే జాతి రత్నాలు సినిమాని తలపిస్తుందని చెప్పాలి. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నటుడు ప్రియదర్శికి జాతి రత్నాలు సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ నటించిన ఈ కామెడీ ఎంటర్టైలర్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

జాతి రత్నాలతో పోలిక లేదు..

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ అప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాతి రత్నాలు సినిమా ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయిందని తెలిపారు. అయితే రాబోయే మిత్రమండలి సినిమా కూడా అదే విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అయితే ఆ సినిమాకు ఈ సినిమాకు ఏమాత్రం పోలిక ఉండదని తెలిపారు. ఇక జాతి రత్నాలు 2 (Jathi Rathnalu)సినిమా గురించి కూడా ప్రస్తావనకు రావడంతో ఇప్పుడు కనుక జాతి రత్నాలు సీక్వెల్ చేస్తే నేను మాత్రం ఈ సినిమాలో అస్సలు నటించను అంటూ ప్రియదర్శి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.


కామెడీ ఎంటర్టైనర్ గా మిత్రమండలి..

జాతి రత్నాలు లాంటి ఒక క్లాసిక్ సినిమాని ఇప్పుడు చేయొచ్చేమో కానీ నేను మాత్రం అసలు నటించను అంటూ ఈ సందర్భంగా ప్రియదర్శి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.  ఇక మిత్ర మండలి సినిమా విషయానికి వస్తే విజయేందర్ దర్శకత్వంలో బీవీ వర్క్స్ బ్యానర్ పై బన్నీ వాసు తొలి సినిమాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి నిహారిక ఎన్ ఎమ్ ప్రధాన పాత్రలలో నటించగా, సత్య, వెన్నెల కిషోర్,విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా వంటి వారు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం మంచి అంచనాలనే పెంచేసాయి. ఈ సినిమా కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read: Priyanka Arul Mohan: జూలియేట్ గా రాబోతున్న కన్మణి.. మరోసారి నానికి జంటగా?

Related News

Bahubali: బహుబలి ఫస్ట్ హీరో ప్రభాస్ కాదా? ఇన్నాళ్లకు బయట పెట్టిన నిర్మాత!

Akhanda 2 : బాలయ్య బాబు రికార్డ్ బిజినెస్ – ‘అఖండ 2’కు ఊహించని రేట్లు!

Priyanka Arul Mohan: జూలియేట్ గా రాబోతున్న కన్మణి.. మరోసారి నానికి జంటగా?

SSMB29 : రాజమౌళి మాస్టర్ ప్లాన్, మహేష్ బాబు తో ఆ పని చేస్తున్న జక్కన్న

Heroine : హీరోయిన్ పై దారుణం, మత్తు మందిచ్చి ఆ పని చేసిన నటుడు

Mohan Lal: మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న మోహన్ లాల్.. సంతోషంలో అభిమానులు!

Ravi Teja: మాస్‌ జాతర సాంగ్‌ ట్రోల్స్‌పై రవితేజ రియాక్షన్, ఏమన్నారంటే..!

Big Stories

×