E-Paper
Advertisement

Odisha Crime: బీజేపీ లీడర్‌ను కాల్చి చంపేశారు.. ఒడిశాలో దారుణ ఘటన

Odisha Crime: బీజేపీ లీడర్‌ను కాల్చి చంపేశారు.. ఒడిశాలో దారుణ ఘటన
Advertisement

Odisha Crime: ఒడిశా రాష్ట్రంలో దారుణ హత్య జరిగింది. బెర్హంపూర్ నగరంలో స్థానిక బీజేపీ లీడర్, సీనియర్ న్యాయవాది అయిన పితాబస్ పాండా సోమవారం రాత్రి దారుణంగా హత్యకు గురయ్యారు. బ్రహ్మనగర్ ఏరియాలోని ఆయన నివాసం వద్ద ఈ ఘటన జరిగింది.

ఒడిశా స్టేట్ బార్ కౌన్సిల్ లో సభ్యుడిగా కూడా ఉన్న పాండాపై ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి దాడి చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. రాత్రి సుమారు 10 గంటల సమయంలో దుండగులు ఆయనపై రెండు కాల్పులకు దిగారు. కాల్పులు జరిగిన వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు పాండాను సమీపంలోని ఎంకేసిజి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు.

Advertisement

ALSO READ: TGPSC Group-1: టీజీపీఎస్సీకి గుడ్ న్యూస్.. గ్రూప్-1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

ఈ హత్య తర్వాత బెర్హంపూర్ నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీనియర్ పోలీస్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించడం ప్రారంభించారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడి వెనుక ఉన్నది ఎవరో..? తెలుసుకోవడానికి.. నిందితులను త్వరగా పట్టుకోవడానికి సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని పోలీసు అధికారులు అధికారులు తెలిపారు.

Advertisement

ALSO READ: Weather News: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, అక్కడక్కడ పిడుగుల వర్షం..?

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×