Bahubali: బాహుబలి గత పది సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించింది.. ఈ సినిమా విడుదలయ్యి 10 సంవత్సరాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) , చిత్ర బృందం ఈ సినిమాని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. ఈ క్రమంలోనే రెండు భాగాలను కలిపి ఒకే భాగంగా బాహుబలి ది ఎపిక్ (Bahubali The Epic)పేరిట అక్టోబర్ 31వ తేదీ విడుదల చేయాలని చిత్ర బృందం భావించారు. ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి బాహుబలి సినిమా ట్రేడింగ్ లోకి వచ్చింది.
ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ తిరిగి విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే నిర్మాత శోభు యార్లగడ్డ(Shobu Yarlagadda) ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బాహుబలి సినిమా గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. బాహుబలి 3కి సంబంధించిన అప్డేట్ ది ఎపిక్ క్లైమాక్స్ లో ఉండబోతోంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై నిర్మాత స్పందించారు. బాహుబలి 3 పనులు ఇంకా మొదలు కాలేదని కాకపోతే ది ఎపిక్ క్లైమాక్స్ లో మాత్రం ఒక సర్ప్రైజ్ ఉండబోతుందని ఈయన క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
ఇకపోతే ఈ సినిమాలో రాజమౌళి అలాగే చిత్ర బృందం మొదట హీరోగా ప్రభాస్ ను ఎంపిక చేయలేదని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ వార్తలపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. ప్రభాస్ కంటే ముందుగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) తో ఈ సినిమా చేయాలనే ఆలోచనలు చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు ఇప్పటికీ వినపడుతూనే ఉన్నాయి. ఈ విషయంపై శోభు యార్లగడ్డ మాట్లాడుతూ.. బాహుబలి సినిమా అనుకున్నప్పటి నుంచి మేము ప్రభాస్ మాత్రమే హీరోగా ఉండాలని అనుకున్నాము తప్ప ఏ ఒక్క హీరో గురించి ఆలోచించలేదని ఇక హృతిక్ రోషన్ ను మేము అసలు కలవలేదనీ ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు.
కట్టప్ప గురించి సినిమా?
ఇక బాహుబలి సినిమా రెండు భాగాలు ఎంతో మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక మూడో భాగం కూడా ఉంటుందని ప్రకటించారు. కానీ ఇది మరి కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలే ఉన్నాయని స్పష్టం అవుతుంది. ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ చేయబోతున్నారంటూ కూడా వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కట్టప్ప జీవితం గురించి ఓ కథ రాయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇదివరకు వార్తలు వినిపించాయి. బాహుబలి సినిమా విజయంలో కట్టప్ప పాత్ర కీలకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో అసలు ఈ కట్టప్ప ఎవరు? ఈయన కుటుంబ నేపథ్యం ఏంటి? అనే సందేహాలు చాలా మదిలో కలిగాయి. ఈ నేపథ్యంలోనే రచయిత విజయేంద్ర ప్రసాద్ సైతం కట్టప్ప జీవిత కథ గురించి సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇదే విషయాన్ని ది ఎపిక్ క్లైమాక్స్ లో వెల్లడించనున్నారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Jathi Rathnalu 2: జాతి రత్నాలు 2 అస్సలు చెయ్యను.. ఇదేం ట్విస్ట్ ప్రియదర్శి?