Post Retirement Income: పదవీ విరమణ తర్వాత ప్రశాంతమైన జీవనం గడిపేందుకు ఆర్థిక ప్రణాళిక అవసరం. పొదుపులో స్వీయ క్రమశిక్షణ ఉండాలి. పదవీ విరమణ తర్వాత నెలకు రూ. లక్ష సంపాదించాలనుకునే వారు.. ఎంత కార్పస్, ఎలా కూడబెట్టుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. చాలా ముందుగా, తెలివిగా పెట్టుబడి పెట్టడం వల్ల ఇది సాధించవచ్చు.
పెట్టుబడి పెట్టే ముందు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం లక్ష రూపాయల విలువ 20-30 సంవత్సరాల తర్వాత చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల నెలవారీ పదవీ విరమణ ఆదాయం రూ. 1 లక్ష కోసం ప్రణాళిక వేసేటప్పుడు ద్రవ్యోల్బణం చాలా కీలకం.
ఉదాహరణకు మీరు నెలకు లక్ష రూపాయలు ఖర్చు చేస్తుంటే, 20 సంవత్సరాల తర్వాత పదవీ విరమణ చేయాలని భావిస్తున్నారనుకోండి. ప్రతి సంవత్సరం 6% ద్రవ్యోల్బణం అంచనా వేస్తే.. మీకు నెలకు దాదాపు 3.2 లక్షలు అవసరం అవుతుంది. ప్రస్తుతం మీ ఖర్చు రూ. 30,000 అయితే, 20 ఏళ్ల తర్వాత మీకు నెలకు దాదాపు రూ. లక్ష అవసరం అవుతుంది.
అందుకు ముందుగా మీరు కార్పస్‌ను కచ్చితంగా అంచనా వేసుకోవాలి. ద్రవ్యోల్బణ రేటుకు తగిన విధంగా కార్పస్ అంచనాలు ఉండాలి. దాదాపు 85 సంవత్సరాల నిర్థిష్ట ఆదాయం పొందేలా ప్లాన్ చేయండి.
ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం మీరు 60 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేస్తే, ప్రస్తుత ఆదాయం నెలకు లక్ష రూపాయలు లేదా సంవత్సరానికి రూ.12 లక్షలు ఉందనుకోండి. 25 సంవత్సరాల పాటు ఉద్యోగం చేస్తే 85 ఏళ్ల వయస్సు వరకు ఆదాయం పొందేలా కార్పస్‌ను ఏర్పాటు చేసుకోవాలి. పదవీ విరమణ తర్వాత ఏడాది 6% రాబడి, 5% ద్రవ్యోల్బణంతో అంచనా వేసిన కార్పస్ దాదాపు రూ. 2.5 కోట్లు అవుతుంది. ఈ మొత్తం 25 ఏళ్లలో ద్రవ్యోల్బణానికి అనుగుణంగా నెలకు రూ. 1 లక్షను ఆదాయం లభిస్తుంది.
ఉద్యోగం ప్రారంభించిన సమయంలోనే పొదుపుపై నిర్ణయం తీసుకోవాలి. క్రమం తప్పకుండా పొదుపు చేయడంతో పదవీ విరమణ సమయానికి అధిక మొత్తాన్ని జమ చేసుకోవచ్చు. ఈక్విటీలు, డెట్, యాన్యుటీలలో దీర్ఘకాలిక పెట్టుబడుల, మ్యూచువల్ ఫండ్లలో SIPలతో కార్పస్ ను పెంచుకోవచ్చు.
Also Read: Digital Currency: ఇండియాలో డిజిటల్ కరెన్సీ.. క్రిప్టో కరెన్సీని నో ఛాన్స్, మంత్రి గోయల్ క్లారిటీ
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి పన్ను ప్రయోజనకరమైన ఖాతాలలో పెట్టుబడులు పెడితే పొదుపు మరింత పెరుగుతుంది. పదవీ విరమణ సమయానికి అధిక మొత్తంలో కార్పస్ పొందాలంటే పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను కాలానుగుణంగా సమీక్షించి, మార్పుచేర్పులు చేసుకోవాలి.