Galaxy A07 4G vs Lava Bold N1 5G vs Tecno Pop 9 5G| శామ్‌సంగ్ ఇండియాలో గెలాక్సీ A07 4Gని ఇటీవలే లాంచ్ చేసింది. ఇది లో బడ్జెట్ ఫోన్ రేంజ్‌లో నేరుగా లావా బోల్డ్ N1 5G, టెక్నో పాప్ 9 5Gతో పోటీ పడుతుంది. మూడు ఫోన్‌లు బడ్జెట్ కస్టమర్లకే టార్గెట్ చేస్తున్నాయి. ఏ ఫోన్ కొనుగోలు చేయాలో ఫీచర్ల పరంగా పోల్చి చూద్దాం.
గెలాక్సీ A07 4G 4GB+64GB ప్రారంభ ధర ₹8,999. లావా బోల్డ్ N1 5G 4GB+64GB ధర ₹6,999. టెక్నో పాప్ 9 5G 4GB+128GB ధర ₹8,299. మూడింటిలో బోల్డ్ N1 చీపెస్ట్.
గెలాక్సీ A07 4Gలో 6.7-ఇంచ్ PLS LCD స్క్రీన్ ఉంటుంది. HD+ రెజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. లావా బోల్డ్ N1 5Gలో 6.75-ఇంచ్ HD+ డిస్‌ప్లే. 90Hz రేట్, 20:9 అస్పెక్ట్ రేషియో స్క్రీన్ ఉండగా… టెక్నో పాప్ 9 5Gలో IPS LCD. 720×1612 పిక్సెల్స్, 120Hz రీఫ్రెష్ రేట్. టెక్నీ పాప్ 9 స్మూత్ స్క్రోలింగ్‌తో మూడు ఫోన్‌లలో బెటర్ ఆప్షన్.
శామ్‌సంగ్ మీడియాటెక్ హెలియో G99 చిప్ ఉపయోగిస్తుంది. బేసిక్ టాస్క్‌లకు మంచిది. బోల్డ్ N1 5G ఆక్టా-కోర్ యూనిసాక్ T765తో పనిచేస్తుంది. పాప్ 9 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6300తో పవర్ ఫుల్ ఆప్షన్. చాలా స్పీడ్ గా రన్ అవుతుంది.
గెలాక్సీ A07 4G ఆండ్రాయిడ్ 15పై వన్ UI 7. బోల్డ్ N1 5G ఆండ్రాయిడ్ 15. పాప్ 9 5G ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. అన్నీ 4GB RAM మాత్రమే కలిగి ఉన్నాయి. బోల్డ్ N1, పాప్ 9 128GB స్టోరేజ్ తో శాంసంగ్ కంటే బెటర్.
గెలాక్సీ A07 4Gలో 50MP ఆటోఫోకస్ రియర్ కెమెరా ఉండగా.. 2MP డెప్త్. 8MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఉంది. బోల్డ్ N1 5Gలో 13MP AI డ్యూయల్ రియర్ కెమెరా. 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. పాప్ 9 5Gలో 48MP ప్రైమరీ రియర్. 8MP ఫ్రంట్ కాల్స్ కు బాగుంటుంది. సెల్ఫీల కోసమైతే పాప్ 9 బెస్ట్.
మూడు ఫోన్‌లలో కూడా 5,000mAh బ్యాటరీ ఉంది. గెలాక్సీ A07 4G 25W చార్జింగ్. బోల్డ్ N1 5G, పాప్ 9 5G 18W చార్జింగ్‌ని సపోర్ట్ చేస్తాయి. చార్జింగ్ విషయంలో గెలాక్సీ ఫాస్టెస్ట్.
వాల్యూ కోసం బోల్డ్ N1 ఎంచుకోండి. చార్జింగ్, శామ్‌సంగ్ బ్రాండ్ పెర్క్స్ కోసం గెలాక్సీ A07 బెటర్. 5G, మంచి డిస్‌ప్లే కోసమైతే టెక్నో పాప్ 9 కొనుగోలు చేయండి.
Also Read: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!