AP Dairy Farmers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పాడి రైతులకు అవసరమయ్యే పశుగ్రాసం పెంచే దిశగా చర్యలు చేపట్టింది. రైతుల కోసం పశుగ్రాసం పెంపకం పథకాన్ని అమలు చేస్తుంది. ఇందుకోసం ఉపాధి హామీ పథకం ద్వారా 100 శాతం రాయితీతో పశుగ్రాసం సాగుకు చర్యలు చేపట్టింది. ఒక్కో రైతుకు గరిష్ఠంగా 50 సెంట్ల వరకు పశుగ్రాసం పెంచేందుకు ప్రోత్సాహం అందిస్తుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పశుగ్రాసం సాగుకు రైతుల నుంచి దరఖాస్తు ఆహ్వానించింది.
పశుగ్రాసం పథకం ముఖ్యాంశాలు
- పశుగ్రాసం పెంపకానికి 100% రాయితీ
- ఒక్కో రైతుకు గరిష్ఠంగా 50 సెంట్ల వరకు పశుగ్రాసం సాగుకు అనుమతి
- ఈ పథకం ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగిన రైతులకు మాత్రమే వర్తిస్తుంది.
- ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు (5 ఎకరాల లోపు) ఈ పథకానికి అర్హులు
- రైతులు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రం లేదా పశువైద్యాధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి.
- పశుగ్రాసం సాగుకు నీటి వసతి ఉన్న భూములను మాత్రమే ఎంపిక చేస్తారు.
- రైతుల ఎంపిక విధానం ఇలా
- రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రం లేదా పశువైద్యాధికారిని సంప్రదించి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
- గ్రామసభల ద్వారా ఈ పథకానికి అర్హులైన రైతులను ఎంపిక చేస్తారు.
- అర్హులైన రైతులను ఎంపిక చేసి జాబితాను జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం పంపిస్తారు.
- అధికారుల పర్యవేక్షణలో పశుగ్రాసం సాగుకు అనుమతి ఇస్తారు.
- పశుగ్రాసం సాగుతో ప్రయోజనాలు
- పాడి రైతుల పశువులకు తగిన ఆహారం సులభంగా లభిస్తుంది.
- గ్రామాల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది.
- రైతుల ఆర్థిక స్థిరత్వానికి అవకాశం ఏర్పడుతుంది.
- పశుగ్రాసం పెంపకం కోసం రైతులు దరఖాస్తుతో పాటు రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, పొలం 1బి, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం జిరాక్స్‌లను అధికారులకు అందజేయాలి.
Also Read: Anantapur Land Grab: అనంతపురంలో అదుపులేని భూ కబ్జాలు.. అధికార పార్టీ నేతపై ఆరోపణలు
పాడి రైతులకు ప్రోత్సాహకాలు
- 50 సెంట్లలో కూలీల వేతనం కోసం రూ.15000, సామాగ్రి కోసం రూ.17,992 కలిపి మొత్తం రూ.32,992 ప్రభుత్వం అందిస్తుంది.
- 40 సెంట్లలో కూలీల వేతనం కోసం రూ. 12,000, సామాగ్రి కోసం రూ.14,394 కలిపి మొత్తం రూ.26,394 అందిస్తారు.
- 30 సెంట్లలో కూలీల వేతనం కోసం రూ.9 వేలు, సామాగ్రి కోసం రూ.10,795 కలిపి మొత్తం రూ.19,795 ఇస్తారు.
- 20 సెంట్లలో కూలీల వేతనం కింద రూ.6 వేలు, సామాగ్రి కోసం రూ.7,197 కలిపి మొత్తం రూ.13,197 అందిస్తారు.
- 10 సెంట్లలో కూలీల వేతనం కోసం రూ.3 వేలు, సామాగ్రి కోసం రూ.3,559 కలిపి మొత్తం రూ.6,559 రైతులకు అందిస్తారు.

Share