BigTV English

Bigg Boss 9: మొదటిసారి టాస్క్ గెలిచింది, కానీ.. వరస్ట్ గేమ్ ఆడిన హౌస్ మేట్స్

Bigg Boss 9:  మొదటిసారి టాస్క్ గెలిచింది, కానీ.. వరస్ట్ గేమ్ ఆడిన హౌస్ మేట్స్

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 30వ రోజులోకి ఎంటర్ అయిపోయింది. కిచెన్లో ఆలు కూరను వండారు. అయితే ఎక్కువ శాతం మంది కిచెన్ లో ఎమోషనల్ అయిపోవడం వల్ల ఇమ్మానియేల్ కామెడీగా దయచేసి కిచెన్ లో ఆలూ వండకండి అని చెప్పడం మొదలుపెట్టాడు. ఒకవైపు మా అమ్మని చూడాలి అని తనుజ ఏడవడం మొదలు పెట్టాను, దానిని కూడా ఇమ్మానియేల్ కవర్ చేస్తూ కామెడీ చేశాడు.


భరణిను తనుజ నాన్న అని పిలుస్తున్న విషయం తెలిసిందే. అమ్మని చూడాలి అని తనుజ చెప్పినప్పుడు ఇప్పటికిప్పుడు భరణి అన్నకి ఎలా పెళ్లి చేస్తాం అంటూ ఇమ్మానియేల్ మాట్లాడాడు. కొద్దిసేపటి తర్వాత టెనెంట్స్ కు సంబంధించిన హౌస్ ను కంప్లీట్ గా డేంజర్ జోలో పడేశారు బిగ్ బాస్. కెప్టెన్ రాము ఇమ్మానుయేల్ మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు.

వైల్డ్ కార్డు ఎంట్రీ సిద్ధం

డేంజర్ జోన్ లో ఉన్న వాళ్లను ఒక ఫైర్ స్టోమ్ ముంచేస్తుంది. ఎందుకంటే వైల్డ్ కార్డు ఎంట్రీ తో హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సిన వాళ్ళు రెడీగా ఉన్నారు అని బిగ్ బాస్ చెప్పాడు. ఈ తుఫాన్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీకు ఒక నీడ అవసరం. ఆ నేడే బిగ్ బాస్ ఇల్లు. ఈ వారం ముగిసే లోపు ఎవరైతే డేంజర్ జోలిలో చిక్కుకొని ఉంటారు. బిగ్బాస్ ఒక టాస్క్ పెట్టి దానిలో గెలుపొందితే మీరు సేఫ్ జోన్ లో ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. దానికంటే ముందు మీరు జంటలుగా విడిపోవాలి అని బిగ్ బాస్ చెప్పారు.


కెప్టెన్ రాము, ఇమ్మానుయేల్ మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా డేంజర్ హౌస్ లోకి వెళ్లిపోండి లగేజీ పట్టుకొని అని చెప్పేసారు.

దివ్య – భరణి
పవన్ – రీతు చౌదరి
సంజన – ఫ్లోరా
సుమన్ – శ్రీజ
కళ్యాణ్ – తనూజ
జంటలుగా ఏర్పాటయ్యారు.

పట్టువదలకు టాస్క్

ఈ బిగ్ బాస్ జంటలకు పట్టువదలకు అనే టాస్క్ ఇచ్చారు. టాస్క్ కు ఇమ్మానుయేల్ రాము సంచాలక్ గా వ్యవహరించారు. ఈ టాస్క్ లో పవన్ రీతూ చౌదరి జంట గెలిచింది. అయితే సంచాలక్ గా సరిగ్గా వ్యవహరించలేదు అని కళ్యాణ్ ఇమ్మానుయేల్ తో ఆర్గ్యుమెంట్ చేయడం మొదలుపెట్టాడు. భరణి ఈ టాస్క్ లో గెలవడానికి సాయశక్తిలా ప్రయత్నించాడు కానీ చివరి నిమిషంలో ఓడిపోయారు. మరోవైపు కళ్యాణ్ విషయంలో శ్రీజ కూడా ఆర్గ్యుమెంట్ చేసింది.

2 వీక్స్ ఆడొచ్చి మనల్ని టార్గెట్ చేసింది

తనుజ దివ్య గురించి మాట్లాడుతూ.. టాస్క్ లో టార్గెట్ చేసింది మీ వాళ్ళయినా దివ్య. మీకు ఇంకో విషయం చెప్తున్నా ఒకరిని ఓడించటానికి ఇద్దరి మధ్య బాండింగ్ లోకి దూరి కూడా ట్రై చేస్తున్నారు. దివ్యకి టార్గెట్ నేను కాదు నువ్వు కాదు కళ్యాణ్ టార్గెట్. దివ్యకి కళ్యాణ్ కి మధ్య ప్రాబ్లం ఉంది. నన్ను కూడా తను టార్గెట్ చేస్తుంది. మనం ఎటువంటి పరిస్థితి వచ్చిన గేమ్ లాగే ఆడాలి అంటూ తనూజ చెప్పింది. తను బయట రెండు వారాలు గేమ్ చూసి వచ్చి మనల్ని టార్గెట్ చేస్తుంది.

డేంజర్ హౌస్ మేట్స్ కు రెండో టాస్క్

లీడర్ బోర్డు లో ఉన్నవాళ్లు తమ పాయింట్స్ పెంచుకోవడానికి బిగ్ బాస్ రెండో టాస్క్ కూడా పెట్టారు. ఈ టాస్క్ కి కూడా ఇమ్మానుయేల్ మరియు రాము రాథోడ్ సంచాలక్ గా వ్యవహరించారు. ఈ టాస్క్ లో పవన్, కళ్యాణ్, శ్రీజ అతి తెలివితో ఆడారు. కానీ ఈ టాస్క్ జెన్యూన్ గా ఆడింది ఫ్లోరా మరియు సంజన. ఇదే విషయాన్ని బిగ్బాస్ కూడా చెప్పారు. ఈ టాస్క్ ఎవరు బాగా ఆడలేదు కాబట్టి ఈ టాస్క్ ను రద్దు చేస్తున్న అని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చేశారు.

సంజన వాళ్లు బాగా ఆడారు కాబట్టి వాళ్లకి ఇవ్వాల్సిన పాయింట్స్ ఇచ్చేయండి బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేసింది శ్రీజ. అయితే అది ఎంతవరకు కరెక్ట్ అంటూ రీతు చౌదరి ఆర్గుమెంట్ మొదలుపెట్టింది.

Also Read: Bigg Boss 9 Promo : తప్పుదారిలో గేమ్స్ ఆడిన హౌస్ మేట్స్, బిగ్ బాస్ స్ట్రాంగ్ వార్నింగ్

Related News

Bigg Boss 9 Promo : తప్పుదారిలో గేమ్స్ ఆడిన హౌస్ మేట్స్, బిగ్ బాస్ స్ట్రాంగ్ వార్నింగ్

Bigg Boss : బిగ్ బాస్ హౌస్‌లో కాస్ట్యూమ్స్ కష్టాలు… కొత్త బట్టలు కావాలంటే తిప్పలే

Bigg Boss 9 Promo: ముదిరిన లవ్ ట్రాక్.. నవ్వులే కాదు కన్నీళ్లు కూడా!

Bigg Boss: బిగ్‌ బాస్‌కి షాక్.. షో ఆపేయాలంటూ ప్రభుత్వం నోటీసులు!

Bigg Boss 9 Telugu : రీతూ లవ్ స్టోరీ పై మాస్క్ మ్యాన్ షాకింగ్ కామెంట్స్.. నెక్స్ట్ ఎలిమినేట్ ఆమె..?

Bigg Boss 9 Promo : వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ… హౌస్‌మేట్స్ బెండ్ తీస్తున్న బిగ్ బాస్!

Bigg Boss 9 Telugu : ఆమె వల్లే మా వాడు ఫోకస్ చెయ్యట్లేదు.. పవన్ తమ్ముడి హాట్ కామెంట్స్..!

Big Stories

×