Big Stories

Vivo X100 Ultra Mobile: 16GB ర్యామ్, 1TB స్టోరేజ్, 200MP కెమెరాతో Vivo నుంచి మెగా ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే?

Vivo X100 Ultra Mobile Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తమ వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు కొత్త కొత్త మోడళ్లను సిరీస్ రూపంలో మార్కెట్‌లో రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే ఎన్నో రకాల సిరీస్‌లను లాచ్ చేసిన వివో.. తాజాగా మరొక కొత్త మోడల్‌ను రిలీజ్ చేసింది. ఈ సారి రిలీజ్ చేసిన ఫోన్ మాత్రం మామూలు ఫీచర్లతో రాలేదు.. అదరగొట్టే ఫీచర్లు, వావ్ అనిపించే కెమెరాతో వచ్చింది. మరి వివో లాంట్ చేసిన ఆ ఫోన్ ఏంటో.. దాని ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం. వివో కంపెనీ ఫ్లాగ్‌షిప్ కెమెరా ఫీచర్లతో సరికొత్త Vivo X100 Ultra స్మార్ట్‌ఫోన్‌ను మే 14న చైనాలో లాంచ్ చేసింది. ఈ కొత్త ఎక్స్ 100 మొబైల్ మంచి ఫీచర్లను కలిగి ఉంది.

- Advertisement -

Vivo X100 Ultra Specifications:

- Advertisement -

వివో ఎక్స్ 100 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ సిమ్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14-ఆధారిత FunTouch OS 14పై ఆధారపడి పనిచేస్తుంది. 6.78-అంగుళాల 2K (1,440 x 3,200 పిక్సెల్‌లు) E7 LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 3,000 nits బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఆక్టా-కోర్ 4nm స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoCను కలిగి ఉంది.

అంతేకాకుండా ఇది వివో ఎక్స్ 100 అల్ట్రా Zeiss బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ Sony LYT-900 సెన్సార్‌తో CIPA 4.5 లెవెల్ గింబల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-1 యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది.

Also Read: వివో నుంచి శాటిలైట్ ఫోన్.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోద్ది మచ్చా!

అలాగే 200-మెగాపిక్సెల్ APO టెలిఫోటో ISOCELL HP9 సెన్సార్‌తో వస్తుంది. దీనిద్వారా 4K మూవీ పోర్ట్రెయిట్ వీడియోలను చాలా అద్భుతమైన క్వాలిటీతో తీయవచ్చు. ఇందులో బ్లూప్రింట్ ఇమేజింగ్ చిప్ V3+ చిప్ ఉంటుంది. సెల్ఫీల కోసం 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది గేమింగ్ కోసం ఎక్స్ యాక్సిస్ మోటార్‌తో కూడా వస్తుంది. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.

Vivo X100 Ultra Price:

Vivo X100 Ultra ధర విషయానికొస్తే.. 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ దాదాపు రూ.74,500 నుండి ప్రారంభమవుతుంది. అలాగే 16GB + 512GB వేరియంట్ దాదాపు రూ. 84,000, 16GB + 1TB మోడల్ వేరియంట్ దాదాపు రూ.92,000 వరకు ఉంటుంది. ఇది బై యుగువాంగ్, స్పేస్ గ్రే, టైటానియం కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇండియా లాంచ్ వివరాలు సంస్థ ఇంకా వెల్లడించలేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News