Akhanda 2 : బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ 2. ఇదివరకు వీరి కాంబినేషన్లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి. బోయపాటి శ్రీను ఎంతమంది హీరోలతో సినిమాలు చేసినా కానీ బాలకృష్ణతో సినిమా అంటే ప్రత్యేకంగా ఉంటుంది.
బాలయ్యను చాలా అందంగా చూపించడం మాత్రమే కాకుండా, ఎటువంటి కమర్షియల్ అంశాలు బాలయ్యతో చెబితే బాగుంటుందో అనేది దర్శకుడు బోయపాటి శ్రీనుకి క్లారిటీ ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న అఖండ టు సినిమా డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమా బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్ లో జరుగుతుంది. సిడెడ్ ప్రాంతానికి సంబంధించి టూ ఏరియాస్ లో బాలయ్య బాబు పర్సనల్ డాక్టర్ 24 కోట్లకు డిస్ట్రిబ్యూషన్ కొనుగోలు చేశారు. మరోవైపు నైజం లో 30 కోట్ల వరకు ధర పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్ లో 55 కోట్ల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు బాలయ్య బాబు కెరీర్ లో ఈ రేంజ్ బిజినెస్ జరగలేదు.
ఈ సినిమాకి సంబంధించి పనులు తుది దశలో ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను డిసెంబర్లో తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారు. రీసెంట్ గా విడుదలైన పోస్టర్ లో కూడా డిసెంబర్ రిలీజ్ అని క్లారిటీ ఇచ్చేశారు.
ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ టైమ్స్ లో తమన్ సంగీతం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ముఖ్యంగా బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమాలకు తమన్ ఒక రేంజ్ లో సంగీతం అందిస్తున్నారు. కేవలం తన బ్యాక్ గ్రౌండ్ సీన్ తో నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ అయిన సీన్స్ కూడా చాలా ఉన్నాయి. అందుకే తమన్న ఉద్దేశిస్తూ అందరూ నందమూరి తమన్ అని పిలుస్తుంటారు.
ఇంక రీసెంట్ గా ఓజి (OG movie) సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అందించాడు. చాలామంది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు కొణిదెల తమన్ అని పిలవడం కూడా మొదలుపెట్టారు. మరోసారి అఖండ 2 సినిమాతో స్పీకర్లు పగలబోతున్నాయి అని చాలామంది బాలయ్య ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరోవైపు తమన్ కూడా అదే ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి బోయపాటి బాలయ్య కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేయటం ఖాయం.
Also Read: SSMB29 : రాజమౌళి మాస్టర్ ప్లాన్, మహేష్ బాబు తో ఆ పని చేస్తున్న జక్కన్న