OTT Movie : సస్పెన్స్, ట్విస్ట్ లతో నడిచే సీరియల్ కిల్లర్ సినిమాలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. ఇంటెన్స్ స్టోరీలతో మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. కాన్సెప్ట్ ఒకటే అయినా, డిఫరెంట్ థీమ్స్ తో ఈ సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కిల్లర్ హత్యలు చేసి, తలలో ఒక క్లూ వదిలి వెళ్తుంటాడు. కిల్లర్ ని పట్టుకునే క్రమంలో స్టోరీ మరింత ఉత్కంఠతను పెంచుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే.
‘కట్ ఆఫ్’ (Cut off) 2018లో వచ్చిన జర్మన్ థ్రిల్లర్ సినిమా. క్రిస్టియన్ అల్వర్ట్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో పాల్ హెర్జ్‌ఫెల్డ్ (మోరిట్జ్ బ్లైబ్‌ట్రూ), లిండా (జాస్నా ఫ్రిట్జి బావర్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 45 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, IMDbలో 6.5/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
పాల్ శవాల మీద పోస్ట్‌మార్టం చేసి క్రైమ్ క్లూస్ కనుక్కునే ఒక డాక్టర్. అతను తన కూతురిలో వచ్చిన మార్పు గురించి బాధపడుతూ ఉంటాడు. ఒక రోజు అతనికి ఒక శవం వస్తుంది, అది చాలా ముక్కలు చేయబడి ఉంటుంది. పోస్ట్‌మార్టం చేస్తే, శవం తలలో ఒక చిన్న క్యాప్సూల్ దొరుకుతుంది. ఆ క్యాప్సూల్‌లో ఒక ఫోన్ నంబర్, పాల్ కూతురు పేరు రాసి ఉంటుంది. ఇది చూసి పాల్ షాక్ అవుతాడు. తన కూతురు ప్రమాదంలో ఉందని అనుకుంటాడు. అతను ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు.
పాల్ ఆ ఫోన్ నంబర్‌కు కాల్ చేస్తాడు. కానీ ఎవరూ సమాధానం ఇవ్వరు. అతను లిండా అనే ఒక యంగ్ ఫోరెన్సిక్ స్టూడెంట్‌తో కలిసి ఈ కేస్‌ను ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వాళ్లు శవం నుంచి మరిన్ని క్లూస్ వెతుకుతారు. ఈ శవం ఒక సీరియల్ కిల్లర్ చేసిన మర్డర్ అని తెలుస్తుంది. కిల్లర్ చాలా తెలివిగా, క్రూరంగా ఉంటాడు. ఇంకా మరిన్ని శవాల్లో క్లూస్ దాస్తాడు. పాల్ తన కూతురును కాపాడాలని, కిల్లర్‌ను పట్టుకోవాలని టెన్షన్‌లో ఉంటాడు. లిండా, పాల్ కలిసి ఈ కేస్ లో డీప్‌గా వెళతారు. కానీ కిల్లర్ ఎవరో తెలియక ఇబ్బంది పడతారు.
Read Also : వరుస హత్యలు… ఆ రోగం ఉన్న పేషంట్సే ఈ సైకో టార్గెట్… సస్పెన్స్ తో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్
ఇన్వెస్టిగేష చేసే సమయంలో ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. కిల్లర్ మోటివ్ పాల్ కూతురుతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇది పాల్‌ను బాధపెడుతుంది. వాళ్లు కిల్లర్ ఎవరో తెలుసుకుని, ఈ హత్యలు ఆపడానికి చాలా రిస్క్ తీసుకుంటారు. ఈ కిల్లర్ ఎవరు ? హత్యలు ఎందుకు చేస్తున్నాడు ? పాల్ ఈ కేసును సాల్వ్ చేస్తాడా ? కిల్లర్ కి, పాల్ కూతురికి ఉన్న సంబంధం ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.