BigTV English

5G Mobile Offers: వర్షాకాలం ఫోన్.. అతి తక్కువ ధరకే.. దీన్ని కొట్టేదేలేదు!

5G Mobile Offers: వర్షాకాలం ఫోన్.. అతి తక్కువ ధరకే.. దీన్ని కొట్టేదేలేదు!

5G Mobile Offers: ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న మెగా జూన్ బొనాంజా సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై బంపర్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు Motorola ఫోన్ కొనాలనుకుంటే మీ కోసం ఒక డీల్ అందుబాటులో ఉంది. మోటరోలా వాటర్‌ప్రూఫ్ 5G ఫోన్ భారీ డిస్కౌంట్‌తో ఉంది. మోటరోలా Edge 40 Neo డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది IP68 (వాటర్‌ప్రూఫ్) రేటింగ్‌తో ఇది అత్యంత తేలికైన 5G ఫోన్. ఈ సేల్‌లో ఈ ఫోన్ ఎంత ధరకు లభిస్తుందో వివరంగా తెలుసుకోండి.


మోటరోలా Edge 40 Neo ఫోన్ 8GB + 128GB, 12GB + 256GB అనే రెండు వేరియంట్లలో లాంచ్ చేశారు. ఆ సమయంలో 8GB RAM వేరియంట్ ధర రూ. 23,999, 12GB RAM వేరియంట్ ధర రూ.25,999. తరువాత కంపెనీ దాని ధరను రూ. 1000 తగ్గించింది.  8GB RAM వేరియంట్ రూ. 22,999. 12GB RAM వేరియంట్ రూ. 24,999గా మారింది. అయితే ఇప్పుడు చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. మీరు బ్లాక్ బ్యూటీ, కెనాల్ బే, పీచ్ ఫడ్జ్, బ్లూ కలర్స్‌లో దక్కించుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్‌‌లో ఫోన్ 8GB RAM వేరియంట్ రూ.22,999. కానీ మీరు బ్యాంక్ ఆఫర్‌లు, బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ట్రాన్జాక్షన్లపై కస్టమర్‌లు రూ. 2,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఫోన్‌పై రూ. 3,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. రెండు ఆఫర్‌ల తర్వాత ఫోన్  8GB RAM వేరియంట్ ధర రూ. 17,999కి తగ్గుతుంది. అంటే లాంచ్ ధర కంటే పూర్తి రూ. 6,000 తక్కువ. ఆఫర్ ముగిసేలోపు వెంటనే కొనుగోలు చేయండి.


ఫోన్ 6.55 అంగుళాల POLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్ సపోర్ట్‌తో వస్తుంది. 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉన్న సెగ్మెంట్‌లో ఇదే మొదటి ఫోన్. మీడియాటెక్ డైమెన్షన్ 7030 ప్రాసెసర్‌తో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే. దీని డిస్‌ప్లే 1300 నిట్‌ల పీక్‌బ్రెట్నెస్ వరకు అలానే HDR10+కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌కు రెండు OS అప్‌గ్రేడ్‌లు, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లు వస్తాయి. ఇది Android 14 నుంచి Android 15 అప్‌గ్రేడ్ అవుతుంది.

ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OISతో 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ఆ టోఫోకస్‌తో 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. వాటర్‌ప్రూఫ్, తేలికైన 5G ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్ IP68 రేటింగ్‌తో వచ్చిన ఫోన్ అత్యంత తేలికైన 5G ఫోన్.

ఇది 30 నిమిషాలు నీటిలో మునిగిపోయిన తర్వాత కూడా పని చేస్తుంది. అంటే మీరు దీన్ని వర్షంలో కూడా ఉపయోగించవచ్చు. ఇందులో రెండు స్పీకర్లు ఉంటాయి. ఫోన్‌లో USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఫోన్ 68W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. కేవలం 15 నిమిషాల్లోనే ఫోన్ 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

Tags

Related News

Best Selling iPhone: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఐఫోన్ మోడల్ ఇదే.. తాజా రిపోర్ట్‌‌లో షాకింగ్ విషయాలు!

Iphone Air : వచ్చేసింది ఐఫోన్ ఎయిర్.. గెలాక్సీ S25 ఎడ్జ్‌కు సవాల్ విసిరిన ఆపిల్

Nothing Phone Discount: నథింగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్‌పై సూపర్ ఆఫర్.. రూ.35000 డిస్కౌంట్.. ఎక్స్‌ఛేంజ్ లేకుండానే!

No network Simcard: ఫోన్‌లో సిమ్ కార్డ్ ఉన్నా నెట్ వర్క్ చూపించడం లేదా? ఇవే కారణాలు..

Samsung Copy Iphone: ఆపిల్ ఫోన్ డిజైన్ కాపీ కొట్టిన శాంసంగ్.. అచ్చం ఐఫోన్ లాగే గెలాక్సీ S26 ఎడ్జ్!

Swiggy High Bill: రెస్టారెంట్ కంటే స్విగ్గీ బిల్లు 81 శాతం ఎక్కువ.. ఆన్ లైన్ డెలివరీతో జేబుకి చిల్లు

×