Apple MacBook Laptop Offer: బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌ను తక్కువ ధరలో కొనాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. ఇప్పుడు అతి తక్కువ ధరలోనే యాపిల్ కంపెనీకి చెందిన ల్యాప్‌టాప్‌ను సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం1 పై సూపర్ డూపర్ డిస్కౌంట్ లభిస్తోంది.
దీని అసలు ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.99,900 ఉండగా ఇప్పుడు భారీ తగ్గింపుతో తక్కువ ధరకే లిస్ట్ అయింది. అయితే ఇప్పుడు మ్యాక్ బుక్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.68,990కి అందుబాటులో ఉంది. అంటే రిలీజ్ అయినప్పుడు ఉండే ధరకంటే రూ.30,910 తక్కువ అన్నమాట. అయితే ఈ డిస్కౌంట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు లభిస్తుంది.
అలాగే పలు బ్యాంక్ ఆపర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ఈఎంఐ లావాదేవాలపై రూ.5000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ వర్తిస్తే యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ఎం1 ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.63,990లకు మత్రమే కొనుక్కోవచ్చు. అంటే దీనిపై మొత్తంగా రూ.36,000 భారీ డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. ,ఇవి కాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. ఏకంగా రూ.33000 వరకు భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందొచ్చు.
Also Read: దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది.. రూ.20 వేల లోపే ల్యాప్‌టాప్‌లు.. ఓన్లీ అక్కడ మాత్రమే..!
ఇక దీని ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 2560*1600 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. 13.3 అంగుళాల రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్యాక్‌లిట్ కీబోర్డు, 720పి హెచ్‌డి వెబ్‌క్యామ్, రెండు యూఎస్బీ-సి పోర్ట్‌లు, స్టీరియో స్పీకర్లు, ఫోర్స్ టచ్ కీప్యాడ్, ఆడియో జాక్‌తో సహా మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది దాదాపు 18 గంటల వరకు భారీ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.