Kind India:కైండ్ ఇండియా.. ఈ సంస్థ తాజాగా కొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ ను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వెరిఫైడ్ ఎన్జీవోలు, దాతలను ఒకే వేదికపై తీసుకువస్తూ.. భారతీయ సమాజంలో అతి ముఖ్యమైన దయ, దాతృత్వ విలువలను తిరిగి ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ఫ్లాట్ ఫారమ్ రూపొందించబడింది. కేవలం 100 రూపాయల నుండి ప్రారంభమయ్యే విరాళాలతో “వంద రూపాయల చారిటీ రెవల్యూషన్” అనే ఒక కొత్త ఉద్యమానికి నాంది పలుకుతోంది కైండ్ ఇండియా..
ముఖ్యంగా ఈ కొత్త ఆన్లైన్ ప్లాట్ ఫారమ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. అనాథాశ్రమాలు, ఆలయాలు, వృద్ధాశ్రమాలు, విద్యాసంస్థలు, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు వంటి విభిన్న రంగాలకు చెందిన ఎన్జీవోలను ఒక తాటిపైకి తీసుకొస్తూ కైండ్ ఇండియా చారిటీని అందరి దయనందిన జీవితంలో భాగం చేయాలనే మంచి ఉద్దేశంతోనే దీనిని ప్రారంభించినట్లు సమాచారం.
ఇకపోతే తాజాగా ఈ ఆన్లైన్ ఫ్లాట్ ఫారమ్ ప్రారంభోత్సవం సందర్భంగా కైండ్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. “మనం ఆన్లైన్లో షాపింగ్ ఫెస్టివల్స్ లో ఎంత ఉత్సాహంగా పాల్గొంటామో.. అంతే ఉత్సాహంతో అవసరమైన వారి గురించి కూడా ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము. పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, పండుగలు ఇలా వేడుక ఏదైనా.. మీరు చేసే చిన్న సహాయం మీ సంతోషాన్ని రెట్టింపు చేసుకొనే అవకాశంగా మార్చుకోవాలి అంటూ ఆయన తెలిపారు.
అలాగే దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహించడం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు కొందరినైనా ఉత్తేజితం చేసి.. మరికొంతమందిని ఈ మార్గంలో నడిపిస్తుందని.. మీ చిన్న సహాయం మీరు ఆనందం పొందడంతో పాటు ఒకరు సంతోషానికి కారణం అవుతారు అంటూ స్పష్టం చేశారు. ఇక దాతృత్వం అనేది కేవలం డబ్బు గురించి మాత్రమే కాకుండా దానిని పంచుకోవడం.. పరస్పర సహాయ సహకారాలు అందించుకోవడం కూడా సమాజంపై మంచి సానుకూల ప్రభావం సృష్టించడం జరుగుతుంది. భారతీయ సమాజం చారిత్రాత్మకంగా ఈ గుణాలకు పెట్టింది పేరు. దానవీరశూర కర్ణుడు మొదలుకొని బలి చక్రవర్తి వరకు మన సంస్కృతి దాతృత్వంతో నిండిపోయి ఉంది. సమాజంలో ఈ గుణాలను మళ్లీ తట్టి లేపి దేశాన్ని ఈ దిశలోనే ప్రయాణింప చేయాలని కైండ్ ఇండియా పరితపిస్తోంది.
ఇకపోతే మంచితనాన్ని సామాజిక అలవాటుగా మార్చాలనే లక్ష్యంతోనే KindIndia.in ఏర్పడింది.. ఎన్జీవోలను, దాతలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి సమాజంలో మంచితనాన్ని ప్రోత్సహించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఈ ఫౌండేషన్ చారిటీని మన జీవన విధానంలో మార్చాలని కోరుకుంటున్నాం అంటూ ప్రతినిధి తెలిపారు.
ఇకపోతే కైండ్ ఇండియా ప్రతినిధులు కే ప్రతాప్ , డి అమర్నాథ్ మంగళవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ..” ముఖ్యంగా ఎన్జీవోలకు దాతలు ఆన్లైన్లో నేరుగా 100 రూపాయల నుండి విరాళాలు అందించవచ్చు అని స్పష్టం చేశారు. ఎంతో ఒత్తిడితో కూడిన జీవనశైలిలో నేటి సమాజంలో దయ, దాతృత్వం తగ్గుముఖం పడుతోందని.. మన మంచి మనసే ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతుందనే భావన ఎంతో సంతృప్తి ఇవ్వగలదు అని తెలిపారు. విరాళాలు ఇవ్వాలనుకున్న దాతలు కైండ్ ఇండియా వెబ్సైట్ ను సంప్రదించాలని” కోరారు.
ALSO READ:Bahubali: The Epic Collections: బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు రాబట్టిందంటే?