Nalgonda Medical College: నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. గత నెల 31న హాస్టల్లో ఫస్ట్ ఇయర్ MMBS విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. వెంటనే బాధితులు ప్రిన్సిపల్ , వార్డెన్ కు ఫిర్యాదు చేయగా.. వారు పట్టించుకోలేదు. అంతేకాకుండా ప్రిన్సిపల్ కు ఎందుకు ఫిర్యాదు చేశారంటూ సీనియర్లు మరోసారి జూనియర్లపై దాడి చేశారు. గతంలో కూడా కేరళకు చెందిన ఫైనల్ ఇయిర్ విద్యార్థులను కూడా ర్యాగింగ్ కారణంగా సస్సెండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే తమ కాలేజీలో ఎటువంటి ర్యాగింగ్ జరగలేదంటూ యాజమాన్యం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అయితే సమాచారం తెలుసుకున్నపోలీసులు, జిల్లా అధికారులు కాలేజీ వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు.