Jagadhatri Serial Actress Deepthi Manne Haldi Event: ‘రాధమ్మ కూతురు‘, ‘జగద్దాత్రి సీరియల్స్’తో బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది కన్నడ బ్యూటీ దీప్తి మన్నే. ప్రస్తుతం జగద్ధాత్రి సీరియల్లో లీడ్ రోల్ చేస్తోంది. త్వరలోనే ఈ భామ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రియుడిని పరిచయం చేసింది. తన ప్రియుడి పేరు రోహన్ అని ప్రకటిస్తూ.. అతడితో దిగిన ఫోటోలు షేర్ చేసింది. ఇందులో వీరిద్దరు రొమాంటిక్గా ఫోజులు ఇచ్చారు. ప్రియుడిని పరిచయం చేసింది.. కానీ, పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు.
దీంతో ఈ భామ పెళ్లి కబురు ఎప్పుడు చెబుతుందా అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. వారందరి సర్ప్రైజ్ చేస్తూ ఓ వీడియో బయటకు వచ్చింది. ఇందులో దీప్తి మన్నే హల్దీ ఫంక్షన్ చేసుకుంటుంది. ఈ వీడియోను ప్రముఖ నటి నవ్య రావు షేర్ చేసింది. దీంతో దీప్తి మన్నే త్వరలోనే ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టబోతుందని తెలిసిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో వధువరులు ఇద్దరు ఒకేచోట డ్యాన్స్ చేస్తూ ఆనందంలో మునిగిపోయారు. ఈ హల్దీ వేడుకలో నవ్వ రావ్ సందడి చేసింది.
భర్తతో కలిసి హాజరై దీప్తి మన్నేతో కలిసి చిందులేసింది. ఆమె ఈ వీడియోని షేర్ చేస్తూ.. ఈ రోజు నీ ముహానికి హల్దీ రాశాను. అదే సమయంలో నా హృదయం మన మాధురమైన జ్ఞాపకాలతో నిండిపోయింది. నవ్వు, ఏడుపు, సక్రెట్స్ ఇంకా ఎన్నో. ఈ లోకంలోని సంతోషాలన్నింటికి నువ్వు అర్హురాలి మై బెస్ట్ ఫ్రెండ్” అంటూ ఎమోషనల్ అయ్యింది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో దీప్తి మన్నే-రోమన్ హల్దీ వేడుక ఘనంగా జరిగింది. ఇందులో కాబోయే కొత్త జంట ఆనందంతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో నవ్య రిలీజ్ చేయడంతో దీప్తి మన్నే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిపోయింది. ఆమెకు అభిమానులు, ఫాలోవర్స్ నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
Also Read: Anasuya Bharadwaj: తమిళ సినిమాలో అనసూయ ఐటెం సాంగ్ రిలీజ్.. ప్రభుదేవతో రొమాన్స్!
కాగా గత నెలలోనే దీప్తి తన ప్రియుడిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మొదట అవును నేను ప్రేమలో ఉన్నానంటూ ప్రియుడితో దిగిన ఫోటోలు షేర్ చేసింది. అయితే అందులో అతడిని చూపించకుండ సస్పెన్స్ పెంచింది. ఆ తర్వాత అతడితో ప్రియుడిని చూపిస్తూ అతడితో ఉన్న బంధాన్ని గుర్తు చేస్తూ ప్రేమ లేఖ రాసింది. “డియర్ రోహన్.. నేను ఇంతకాలం ఎదురుచూస్తున్న వ్యక్తి నువ్వే. ఆ దేవుడే నిన్ను నాకు బహుమతిగా పంపించాడు. నన్ను ఎంచుకున్నందుకు థ్యాంక్యూ. ఐ లవ్ యూ” అంటూ తన పోస్ట్‌కి రాసుకొచ్చింది. కాగా మొదట కన్నడ సీరియల్స్ లో నటించిన దీప్తి.. ఆ తర్వాత తెలుగులో రాధమ్మ కూతురు సీరియల్ తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం జగద్ధాత్రి, పద్మావతి వంటి సీరియల్లో నటిస్తోంది. అలాగే సెలవ్ అనే తెలుగ చిత్రంలోనూ ఆమె హీరోయిన్ గా నటించింది.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==