BigTV English

Mobile Offers: ఇవాళే లాస్ట్.. సామ్‌సంగ్, రియల్‌మి, వన్‌ప్లస్ 5జీ ఫోన్లపై కనీవినీ ఎరుగని డిస్కౌంట్లు..!

Mobile Offers: ఇవాళే లాస్ట్.. సామ్‌సంగ్, రియల్‌మి, వన్‌ప్లస్ 5జీ ఫోన్లపై కనీవినీ ఎరుగని డిస్కౌంట్లు..!

Amazon Great Freedom Festival Sale: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌లో ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ జరుగుతుంది. ఈ సేల్ ఇవాళ్టితో ముగియనుంది. అందువల్ల అతి తక్కువ ధరలో మంచి డిస్కౌంట్లతో ఒక కొత్త 5జీ ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇదే మంచి సమయం. ఈ సేల్‌లో Samsung Galaxy S24 5G, Realme GT 6T 5G, OnePlus 12R ఫోన్లపై భారీ తగ్గింపులు పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై అందుబాటులో ఉన్న డిస్కౌంట్ ఆఫర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.


Samsung Galaxy S24 5G

Samsung Galaxy S24 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.56,499కి లిస్ట్ చేయబడింది. బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10% తక్షణ తగ్గింపు (రూ. 1,000 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత దీనిని రూ. 55,499కే కొనుక్కోవచ్చు. Samsung Galaxy S24 5G ఫోన్ 6.20 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ రెండవ కెమెరా, 10-మెగాపిక్సెల్ మూడవ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో 4000 mAh బ్యాటరీ ఉంది.


Realme GT 6T 5G

Also Read: పిచ్చెక్కించే ఆఫర్.. రూ.8,900లకే 5జీ ఫోన్.. ఎవరికీ చెప్పొద్దు మావా..!

Realme GT 6T 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 30,998కి లిస్ట్ చేయబడింది. కూపన్ ఆఫర్ ద్వారా రూ. 4000 పొందవచ్చు. ఈ డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్‌ను రూ.26,998కి కొనుక్కోవచ్చు. SBI క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10% తక్షణ తగ్గింపు (రూ. 1,000 వరకు) ఉంటుంది. దీని తర్వాత ఈ ఫోన్‌ను రూ. 25,998కి సొంతం చేసుకోవచ్చు. Realme GT 6T ఫోన్ FHD+ రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల 8T LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 6000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. Realme GT 6T Qualcomm Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇది 5,500mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 OS ఆధారంగా Realme UI పై రన్ అవుతుంది.

OnePlus 12R 5G

OnePlus 12R 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.41,999కి లిస్ట్ చేయబడింది. SBI క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10% తక్షణ తగ్గింపు (రూ. 1,000 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత దీనిని రూ. 40,999కి సొంతం చేసుకోవచ్చు. OnePlus 12R ఫోన్ 1.5K పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల కర్వ్డ్-ఎడ్జ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్ 1లో పనిచేస్తుంది. OnePlus 12R స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించబడింది. ఇది 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×