E-Paper
Advertisement

India Microprocessor: చైనా, అమెరికాకు షాకిచ్చిన ఇండియా.. సొంత టెక్నాలజీతో డుయల్ కోర్ మైక్రోప్రాసెసర్ తయారు

India Microprocessor: చైనా, అమెరికాకు షాకిచ్చిన ఇండియా.. సొంత టెక్నాలజీతో డుయల్ కోర్ మైక్రోప్రాసెసర్ తయారు
Advertisement

India Dual-Core Microprocessor| అడ్వాన్స్ టెక్నాలజీలో ఎల్లప్పుడూ ముందుండే అమెరికా, చైనా దేశాలకు భారతదేశం అనూహ్య షాకిచ్చింది. సెమీకండక్టర్, ప్రాసెసర్ టెక్నాలజీలో ఇండియా ఒక పెద్ద మైలురాయి చేరుకుంది. ఇండియా తొలిసారి స్వదేశీ టెక్నాలజీతో 64-బిట్ డ్యూయల్ కోర్ మైక్రోప్రాసెసర్‌ని తయారు చేసింది. దీని పేరు DHRUV64. ఇది 1.0GHz క్లాక్ స్పీడ్‌తో పని చేస్తుంది.

ఈ ప్రాసెసర్ ఎవరు తయారు చేశారు?

భారత ప్రభుత్వానికి చెందిన C-DAC (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్) ఈ ప్రాసెసర్‌ని అభివృద్ధి చేసింది. మైక్రోప్రాసెసర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ ప్రాసెసర్ ని తయారు చేశారు. ఇది పూర్తిగా భారతీయ టెక్నాలజీపై ఆధారపడి ఉంది. స్ట్రాటజిక్, కమర్షియల్ అప్లికేషన్స్‌కి ఉపయోగపడుతుంది.

DHRUV64 డిజైన్ ఎలా ఉంది?

Advertisement

C-DAC ఆధునిక ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ సిద్ధాంతాలని ఉపయోగించి దీన్ని రూపొందించింది. ఎఫిషియెన్సీ, రిలయబిలిటీ, మల్టీటాస్కింగ్ పర్ఫామెన్స్ మీద ఫోకస్ పెట్టారు. డ్యూయల్ కోర్ డిజైన్ వల్ల పారలల్ ప్రాసెసింగ్ స్మూత్‌గా జరుగుతుంది. 64-బిట్ ఆర్కిటెక్చర్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ వర్క్‌లోడ్స్‌కి సరిపోతుంది.

ఈ ప్రాసెసర్ ఎక్కడ ఉపయోగపడుతుంది

DHRUV64 డుయల్ కోర్ ప్రాసెసర్ ని చాలా రంగాల్లో వినియోగించవచ్చు. 5G ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT).. ఇవన్నీ కవర్ చేస్తుంది.

హార్డ్‌వేర్ ఇంటిగ్రేషన్ ఈజీగా జరుగుతుందా?

Advertisement

C-DAC ప్రకారం.. ఈ కొత్త ప్రాసెసర్ తయారీకి ఆధునిక ఫాబ్రికేషన్ టెక్నాలజీ ఉపయోగించారు. వివిధ హార్డ్‌వేర్ ప్లాట్‌ఫామ్‌లతో సులువుగా కనెక్ట్ అవుతుంది. స్కేలబుల్, ఫ్లెక్సిబుల్ డిప్లాయ్‌మెంట్ సాధ్యం.. కమర్షియల్ పొటెన్షియల్ ఎక్కువ.

మైక్రోప్రాసెసర్ ఎందుకు ముఖ్యం?

మైక్రోప్రాసెసర్.. ఎలక్ట్రానిక్ డివైస్‌కి మెదడులా పని చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్స్, శాటిలైట్స్, ఇండస్ట్రియల్ మెషిన్స్, డిఫెన్స్ సిస్టమ్స్.. అన్నీ ప్రాసెసర్ మీద ఆధారపడతాయి.

విదేశీ ప్రాసెసర్ చిప్స్ మీద ఆధారపడటం తగ్గుతుందా?

ప్రపంచంలో 20 శాతం మైక్రోప్రాసెసర్‌లు భారతదేశం వినియోగిస్తోంది. ఇందులో ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. ఇప్పుడు ఇండియా సొంత ప్రాసెసర్ DHRUV64 ఎంట్రీతో విదేశీ చిప్ పై ఆధారపడటం క్రమంగా తగ్గిపోతుంది. సప్లై చైన్ సెక్యూరిటీ పెరుగుతుంది, దేశ వ్యూహాత్మక అవసరాలు కాపాడతాయి.

ఇతర స్వదేశీ ప్రాసెసర్‌లు ఏమిటి?

DHRUV64 కంటేముందు SHAKTI (IIT మద్రాస్), AJIT (IIT బాంబే), VIKRAM (ISRO-SCL), THEJAS64 (C-DAC) వచ్చాయి. ప్రతి ఒక్కటి వేర్వేరు రంగాలకి ఉపయోగపడుతాయి.

C-DAC రాబోయే ప్లాన్స్ ఏమిటి?

C-DAC రిస్క్-V ఆధారిత ప్రాసెసర్‌లు అభివృద్ధి చేస్తోంది. ధనుష్, ధనుష్+ సిస్టమ్-ఆన్-చిప్ ప్లాట్‌ఫామ్‌లు వస్తున్నాయి. ఇవి మరింత పర్ఫామెన్స్, ఎఫిషియెన్సీ ఇస్తాయి.

DHRUV64 భారత్ చిప్ డిజైన్ సామర్థ్యాన్ని చూపిస్తుంది. దేశ భద్రత, కమర్షియల్ అభివృద్ధికి సహాయపడుతుంది. స్వదేశీ టెక్నాలజీ వైపు ఒక పెద్ద అడుగు!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×