Electricity:- భూమిపైన మనుషుల బారం ఎక్కువవుతోంది, దానికి తగినట్టుగానే వారి అవసరాలు కూడా ఎక్కువవుతున్నాయి. ప్రకృతి సిద్ధంగా తయారయ్యే వనరుల దగ్గర నుండి కృత్రిమంగా తయారు చేసే వస్తువుల వరకు అన్ని అవసరానికి తగినట్టుగా ఉత్పత్తి కాలేకపోతున్నాయి. అందుకే వాటికి ప్రత్యామ్నాయలను ఆలోచించడం మొదలుపెట్టారు శాస్త్రవేత్తలు. అందులో ఒకటే వర్చవల్ పవర్ ప్లాంట్ ఆలోచన. కరెంటు అవసరాలను తీర్చడం కోసం శాస్త్రవేత్తలు ఈ కొత్త ఐడియాతో ముందుకొచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా కరెంటు అవసరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులోనూ ఇండియాలో పెరిగిన జనాభాకు తగినట్టుగా కరెంటు అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ఎక్కువగా ఫాజిల్ ఫ్యూయల్‌తో కరెంటును జెనరేట్ చేయడమే ఎక్కువగా జరుగుతుంది. అలా కాకుండా ఫాజిల్ ఫ్యూయల్ అవసరం లేకుండా కరెంటును జెనరేట్ చేయగలిగితే జనాల కరెంటు అవసరాలను తీర్చవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2030లోపు ఈ ప్రయత్నాలను సక్సెస్‌ఫుల్ చేయాలని సన్నాహాలు మొదలుపెట్టారు.
సరైన సదుపాయాలు లేకపోవడం అనేది ఇండియన్ పవర్ సిస్టమ్‌ను వెనక్కి తోస్తుందని శాస్త్రవేత్తలు వాపోతున్నారు. ఎన్నో టెక్నికల్ ఛాలెంజ్‌ల మధ్య ప్రస్తుతం ఈ రంగం పనిచేస్తోందని బయటపెట్టారు. రెన్యూవబుల్ ఎనర్జీలాంటివి కూడా పవర్ సిస్టమ్‌పై అధనపు బారంగా మారుతుందని అన్నారు. దీనికి వర్చువల్ పవర్ ప్లాంట్స్ (వీపీపీ) అనేవి బెస్ట్ సొల్యూషన్‌గా మారుతాయని చెప్తున్నారు. వీపీపీలు జెనరేటర్లు, ఎలక్ట్రిక్ లోడ్స్, స్టోరేజ్ యూనిట్స్ లాంటివాటిని ఒకేసారి మ్యానేజ్ చేయగలవు.
ప్రస్తుతం కరెంటు అనేది దేనికి ఎంత కావాలి అనే కొలతలో వినియోగం ఉండడం లేదు. కానీ వీపీపీలు అనేవి వేటికి ఎంత కరెంటును అందించాలని అనే కచ్చితమైన సమాచారంతో ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా వీపీపీలు ఎంత కరెంటు కావాలో అంత మాత్రమే అందిస్తాయి. దీని కారణంగా కరెంటు బిల్లు భారం పెరగడం లేదా పవర్ ప్లాంట్స్ సంఖ్య పెరగడం వంటి అవసరాలు ఉండవు. వర్చువల్ పవర్ ప్లాంట్స్‌లో రెన్యూవబుల్ ఎనర్జీ కూడా కలిస్తే ఇంక కరెంటు పరంగా ఏ సమస్య ఉండదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ముందుగా వర్చువల్ పవర్ ప్లాంట్స్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అందులో రెన్యూవబుల్ ఎనర్జీని ఇంజెక్ట్ చేయడం ద్వారా బ్లాక్‌ఔట్స్, వోల్టేజ్ సమస్యలు లాంటి వాటిని దూరం చేస్తుంది. దాంతో పాటు పవర్ గ్రిడ్‌ను మరింత మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు అభివృద్ధి చెందిన దేశాల్లో వర్చువల్ పవర్ ప్లాంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా, డెన్మార్క్, జపాన్ లాంటి దేశాలే దీనికి ఉదాహరణలు. త్వరలోనే ఇండియాలో కూడా వర్చువల్ పవర్ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.