iPhone 16 Pro : ఐఫోన్ 16 ప్రో.. Apple తాజాగా లాంఛ్ చేసిన మెుబైల్. ఈ మెుబైల్ పై ఇప్పటికే ఎన్నో ఆఫర్స్ ను యాపిల్ ప్రకటించగా తాజాగా బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ.8100 భారీ తగ్గింపును అందిస్తుంది.
యాపిల్ iPhone 16 Pro ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లాంఛ్ అయింది. ఇక ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో సహా అధునాతన సామర్థ్యాలతో వచ్చేసింది. AIతో పాటు Apple కొత్త చిప్‌సెట్, కొన్ని డిజైన్ ట్వీక్‌లతో మెరుగైన కెమెరా సామర్థ్యాలను సైతం కలిగి ఉంది.
ఇక ఐఫోన్ 16 ప్రో ఇండియన్ మార్కెట్లో రూ.1,19,900 ధరతో ప్రారంభమైంది. ఇక ఇప్పుడు భారతీయ మార్కెట్లో మరింత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఐఫోన్ 16 ప్రో ధర డీల్స్ తో పాటు కెమెరా ఫీచర్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
iPhone 16 Pro ధర –
ఐఫోన్ 16 ప్రో ధర ప్రస్తుతం విజయ్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌లో బేస్ 128GB వేరియంట్ కోసం రూ.1,16,300గా ఉంది. HDFC లేదా RBL బ్యాంక్ కార్డ్ కస్టమర్‌లు రూ.4,500 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ICICI, SBI లేదా కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డ్ ఉంటే రూ. 4,000 తగ్గింపు పొందవచ్చు. కస్టమర్లు తమ బ్యాంకుల ప్రకారం నో-కాస్ట్ EMI ఎంచుకోవచ్చు.
ఇక అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్‌ని కలిగి ఉంటే విజయ్ సేల్స్ లిస్టింగ్ ప్రకారం… ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.7,500 వరకు తగ్గింపు పొందవచ్చు. పాత ఐఫోన్ ను ఎక్స్చేంజ్ ఆఫర్లో మార్చి కొత్త ఫోన్ కొనాలనుకునే వినియోగదారులకు సైతం ఇది బెస్ట్ ఆప్షన్. ఫోన్ కండిషన్ తో పాటు మోడల్ ని బట్టి యాపిల్ కంపెనీ ధరను నిర్ణయించి ఫోన్ ను ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. దీంతో మరింత తక్కువ ధరకే ఐఫోన్ 16ను కొనే అవకాశం ఉంటుంది.
స్పెసిఫికేషన్‌లు –
iPhone 16 Pro ఫీచర్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3 అంగుళాల సూపర్ రెటినా XDR ప్యానెల్ ఉంది. ఇది అధునాతన AI సామర్థ్యాల కోసం A18 ప్రో చిప్ సెట్ తో వచ్చేసింది. 16 కోర్ న్యూరల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఆపిల్ గేమింగ్ కోసం హార్డ్‌వేర్ యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్‌ను కూడా అందించింది. ఇది ప్రస్తుతం iOS 18.2లో నడుస్తుంది. వివిధ రకాల Apple ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను హోస్ట్ చేస్తుంది.
కెమెరా విషయానికొస్తే… స్మార్ట్‌ఫోన్‌లో 48 MP ఫ్యూజన్ కెమెరా క్వాడ్-పిక్సెల్ సెన్సార్, 48 MP అల్ట్రా వైడ్ సెన్సార్‌తో పాటు 12 MP 5x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. కెమెరా కంట్రోల్ బటన్‌తో వచ్చేసింది. ఇక డిస్ ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్ ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. తాజాగా లాంఛ్ అయిన మొబైల్స్ లో ఐఫోన్ 16 ప్రో సేల్స్ లో సైతం టాప్ ప్లేస్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ టాప్ ఎండ్ మొబైల్ ను తక్కువ రేట్ కే కొనాలనుకునే కస్టమర్స్ కు ఇదే బెస్ట్ ఆప్షన్. ఎప్పటినుంచో ఐఫోన్ను కొనాలనుకునే యూజర్స్ సైతం తప్పకుండా ట్రై చేసేయండి.
ALSO READ : బీభత్సంగా పడిపోయిన వన్‌ప్లస్ 12 ధరలు.. 16GB వేరియంట్ 8GB ధరకే!