Upendra on Rajinikanth: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటుడు మరియు దర్శకుడు ఉపేంద్ర. దర్శకుడుగా ఎన్నో యూనిక్ కాన్సెప్ట్ సినిమాలను తెరకెక్కించాడు. డైరెక్టర్ ఉపేంద్ర కు చాలామంది ఇప్పుడున్న దర్శకులు కూడా అభిమానులు ఉన్నారు. ఒక సందర్భంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నేను ఉపేంద్ర గారికి పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చారు. అలానే పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా నేను ఉపేంద్ర కి పెద్ద అభిమాని అంటూ తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం ఉపేంద్ర యుఐ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20 తారీఖున విడుదల కానుంది. ఇతరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొని సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉపేంద్ర.
నాకు కొన్ని సినిమాలు అవకాశాలు వచ్చినా కూడా నేను అప్పుడు ఉన్న బిజీ వలన అవి చేయలేకపోతున్నాను. నేను గత రెండు సంవత్సరాలుగా యుఐ సినిమా కోసం పని చేశాను. ఈ తరుణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో అవకాశం వచ్చింది. ఆయనతో నటించడం అనేది నాకు చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. పాతిక సంవత్సరాలుగా ఆయన దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన ద్రోణాచార్యుడు లాంటివారు నేను ఏకలవ్యుడ్ని. ఇప్పుడు ఆయనతో కలిసి నటిస్తున్నాను. ఇక ద్రోణాచార్యుడు ఏకలవ్యుని మధ్య కథ మనకు తెలియంది కాదు. దూరంగా ఉన్న ద్రోణాచార్యుని గురువుగా భావిస్తూ ఏకలవ్యుడు విద్యను నేర్చుకున్నాడు. ఆ విధంగా రజనీకాంత్ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను అని చెప్పడం ఉపేంద్ర ఉద్దేశ్యం.
గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు ఉపేంద్ర. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం. ఇదే పాత్ర కోసం గతంలో రాజశేఖర్ ను సంప్రదించారు. ఇది విలన్ పాత్రలో ఉంది అని ఒప్పుకోకపోవడం వలన సీనియర్ హీరో ఉపేంద్రను సంప్రదించారు త్రివిక్రమ్. ఉపేంద్ర చేయటం వల్లనే ఆ సినిమాకి ఒక ఫ్రెష్ ఫీల్ కూడా వచ్చింది. ఇక లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న కూలి సినిమాలో ఉపేంద్ర పాత్ర ఎలా ఉండబోతుందో అని అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ ఉంది. అలానే కూలి సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. యు ఐ సినిమా డిసెంబర్ 20న విడుదలై సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా గురించి ఉపేంద్ర మాట్లాడుతూ మీరు ఇదివరకే మైథిలాజికల్ కల్కి చూశారు. ఇప్పుడు సైకలాజికల్ కల్కి చూడండి. అంటూ చెప్పుకొచ్చారు ఈ స్టేట్మెంట్ తో సినిమా మీద క్యూరియాసిటీ ఇంకా పెరిగింది.
Also Read : Srikakulam Sherlockholmes Trailer: బీచ్ ఒడ్డున మేరీని చంపింది ఎవరు.. ఉత్కంఠ రేపుతున్న ట్రైలర్