Galaxy Ring Swell| టెక్నాలజీ వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. తాజాగా అలాంటిదే ఒక దుర్ఘటన జరిగింది. శామ్‌సంగ్ గెలక్సీ రింగ్ వల్ల జరిగిన ఈ భయానక ఘటన భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. టెక్ ఇన్‌ఫ్లుయెన్సర్ డానియల్ రోటార్.. ఈ రింగ్ లోని బ్యాటరీ వాపు కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ రింగ్ ఆరోగ్య ట్రాకింగ్ కోసం ప్రసిద్ధి చెందుతోంది. కానీ ఈ ఘటన ప్రమాణాలను ప్రశ్నిస్తోంది.
భయపెట్టిన అనుభవం
డానియల్ రోటార్ అనే టెక్ యూట్యూబర్ అమెరికాలోని హవాయిలో నివసిస్తున్నాడు. అతను ఫ్లైట్ బోర్డింగ్ సమయంలో గెలాక్సీ రింగ్‌లో సమస్య కారణంగా బ్యాటరీ వాపు ప్రారంభమైంది. దీంతో రోటార్ వేలు కూడా వాచిపోయింది. వేలు వాచిపోయి నొప్పి తీవ్రం కావడంతో అతను దీని గురించి ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఫోటోలు కూడా షేర్ చేశాడు. రింగ్ వాపు వల్ల నొప్పి భరించలేకపోయాడు.. కానీ ఆ రింగ్ వేలి నుంచి తీయలేకపోయాడు. పైగా ఆ సమయంలో విమానం ప్రయాణంలో ఉన్నాడు. ఇది జరిగినప్పుడు అతను రెండు ఫ్లైట్లు పూర్తి చేశాడు.
అతను జనవరి 2025 నుండి గెలాక్సీ రింగ్ ఉపయోగిస్తున్నాడు. బ్యాటరీ లైఫ్ సమస్యలు గతంలో కూడా ఉన్నాయి. సాధారణంగా ఒక వారం పని చేయాలి. కానీ అది 1.5 రోజులు మాత్రమే ఉండేది. ఈ సమస్యలు హెచ్చరికలుగా ఉండవచ్చు.
మూడో ఫ్లైట్ మిస్
రింగ్ వాపు కారణంగా ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అతన్ని ఫ్లైట్‌కు అనుమతించలేదు. లిథియం-ఐయాన్ బ్యాటరీ వాపు డేంజర్. గతంలో శామ్‌సంగ్ నోట్ 7 సమస్యలు గుర్తుకు వచ్చాయి. అతను 47 గంటల ప్రయాణం తర్వాత హోటల్‌లో ఉన్నాడు. తర్వాత ఎమర్జెన్సీగా ఆసుపత్రికి వెళ్లాడు.
డాక్టర్ మొదట ఐస్ వాటర్, సోప్ సూచించలేదు. ఎయిర్‌పోర్ట్‌లో ట్రై చేశాడు. కానీ వాపు మరింత పెరిగింది. నొప్పి తీవ్రమైంది. ఆసుపత్రిలో ఐస్ ఉపయోగించి వాపును తగ్గించారు. తర్వాత మెడికల్ లూబ్రికెంట్ పెట్టి రింగ్ తొలగించారు. రింగ్ తీసిన తర్వాత ఇన్నర్ సైడ్ అంతా నాశనమైనట్లు కనిపించింది. కేసింగ్ నుండి వేరుపడుతోంది. ఇది చాలా భయంకరం.
వాపు కారణాలు ఏమిటి?
ఎక్స్ రిప్లైలో డానియల్ కారణాలు కూడా చెప్పాడు. హవాయిలో వెచ్చని వాతావరణం.. బ్యాటరీలో వాపునకు కారణం కావొచ్చు. సాల్ట్‌వాటర్ ఎక్స్‌పోజర్ కూడా కారణం. రెండు ఫ్లైట్లు ప్రయాణం వల్ల డేనియల్ ఒత్తిడికి కలిగించి ఉండవచ్చు. బ్యాటరీ ఫాల్టీగా ఉండవచ్చు. ముందు బ్యాటరీ సమస్యలు ఉన్నాయి.
ఈ అంశాలు కలిసి వాపును కలిగించాయని అతను అనుకుంటున్నాడు. శామ్‌సంగ్ ఇంకా అధికారిక ప్రతిస్పందన ఇవ్వలేదు. కానీ యూకే సపోర్ట్ టీమ్ ఈ సమస్యపై తొలిసారి స్పందించిది. “ఇది చాలా రేర్ కేస్” అని చెబుతూ.. రింగ్ ని తాము పరిశీలించి సరైన కారణాలు ఏంటో బహిర్గతం చేస్తామని శామసంగ్ అధికారికంగా ప్రకటించింది.
రింగ్ పాపులారిటీ.. భద్రతా ఆందోళనలు
శామ్‌సంగ్ గెలక్సీ రింగ్ 2024 అక్టోబర్‌లో ఇండియాలో లాంచ్ అయింది. ఇది స్మార్ట్ హెల్త్ ట్రాకర్. డిజైన్ అందంగా ఉంది. దీని ప్రయోజనాల కారణంగా టెక్ యూజర్లలో వేగంగా పాపులర్ అయింది. కానీ డానియల్ ఘటన భద్రతపై సందేహాలు కలిగిస్తోంది.
స్మార్ట్ రింగ్‌లు ఉపయోగకరమే. కానీ ఇలాంటి రిస్క్‌లు కూడా ఉన్నాయి. బ్యాటరీ సమస్యలు ఎప్పుడైనా రావచ్చు. మేకర్స్ భద్రతను నిర్ధారించాలి. యూజర్లు అసాధారణ లక్షణాలను గమనించాలి. డానియల్ అనుభవం హెచ్చరిక లాంటింది. ఈ ఘటన తరువాత డానియంల్ “స్మార్ట్ రింగ్ మళ్లీ ధరించను” అని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.
ముందు జాగ్రత్తలు
ఈ ఘటన శామ్‌సంగ్ రింగ్ ఇమేజ్‌పై ప్రభావం చూపిస్తుంది. కస్టమర్లు ఇకపై రింగ్ కొనుగోలు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. టెక్ గాడ్జెట్లు ఫెయిల్ అవుతాయని డానియల్ తన అనుభవాన్ని షేర్ చేసి ఇతరులకు ఒక రకంగా హెల్ప్ చేశాడనే చెప్పాలి. శామ్‌సంగ్ త్వరగా విచారణ చేసి బ్యాటరీ సేఫ్టీ పై హామీ ఇవ్వాలి. ఎందుకంటే యూజర్ల నమ్మకం ఇలాంటి ఘటన తరువాత సన్నగిల్లుతుంది. వారంగా తమ భద్రత గురించే ముందు ఆలోచిస్తారు. స్మార్ట్ డివైస్‌లు హెల్త్ ట్రాకర్లు కావాలి కానీ ఆరోగ్యానికి హానికలిగించకూడదు.
Also Read: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఐఫోన్ మోడల్ ఇదే